కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరి రావు..
కొలువుల భారతి కాదు నిరుద్యోగ విలపిత భారత్ గా మారింది
పదేళ్ల మోడీ పాలనలో వందల విధ్వంసం జరిగింది
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:
మే01
తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరి రావు మీడియా సమావేశం..కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న పాకాల శ్రీహరి రావు,టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచందర్ గౌడ్,ఈ సందర్భంగా పాకాల శ్రీహరి రావు మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రజా పాలనతో మార్పు మొదలైంది. రైతుల కోసం..
రైతుకు పెట్టుబడి సాయం చేసాం.రాష్ట్ర రైతు కమిషన్ ఏర్పాటు చేసాం..త్వరలో పంటల బీమా పథకం ప్రారంభం..ధరణి పోర్టల్ ప్రక్షాళనకు చర్యలు చేపట్టాం..ధరణి ద్వారా రైతులు కోల్పోయిన భూములు కాపాడుతాం..
లక్షకు పైగా ధరణి సమస్యల పరిష్కారంకోసం చర్యలు మొదలుపెట్టాం..కౌలు రైతుల రక్షణకు చట్టం తేవడానికి చర్యలు..97 కోట్ల రూపాయలతో రైతు నేస్తం.డాక్టర్ స్వామినాథన్ సిఫార్సు ప్రకారం పంటలకు ఎంఎస్పి నిర్ణయించిన రోజు దేశవ్యాప్తంగా రైతులు మంచి రోజులు వచ్చినట్టు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డాక్టర్ స్వామినాథ కమిషన్ రిపోర్టు ప్రకారం పంటలన్నిటికీ ఎం.ఎస్.పి నిర్ణయించడం జరుగుతుంది దాని తో రైతులు పండిస్తున్న ప్రధాన పంటలన్నిటికీ క్వింటల్ ఒక్కంటికి ఒక్క వెయ్యి నుంచి మూడు వెయ్యిల రూపాయిల ఎం ఎస్ పి పెరిగే అవకాశం ఉన్నదీ. రైతు సోదరులారా స్వామినాథన్ కమిషన్ను అమలు చేయకపోవడం
రైతులు పండించిన పంటకు అతి తక్కువ ధరను యిస్తూ దేశవ్యాప్తంగా రైతులను నిండా ముంచుతున్న నరేంద్ర మోడీ కి మరో అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు.
ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ మాట్లాడుతూ
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీ విధానంపై బీఆర్ఎస్ వైఖరి ఏమిటో తెలియజేయాలని అన్నారు.ఆ విధానాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తే మోడీకి వ్యతిరేకంగా ఆయన కార్యచరణ ఏంటీ
మోడీ పాలనలో దేశం వికసిత భారత్ కాలేదు,ఆర్థిక భారత్ కాదు ఆకలి భారత్,కొలువుల భారత్ కాదు నిరుద్యోగ విలపిత భారత్ గా మారింది.పదేళ్ల మోడీ పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగింది.మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పార్లమెంట్ కి ఆశీర్వదిస్తే కామారెడ్డి కి త్రాగు సాగు నీరు తెప్పిస్త…బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల పథకం నిలిపేసింది… లేకుంటే కామారెడ్డి లో మూడు లక్షల ఎకరాలకు సాగునీళ్ళు వచ్చేవి.గత కాంగ్రెస్ హయాంలో రేషన్ కార్డులు, సరుకులు ఇచ్చినట్లు ఇప్పుడు ఇస్తాము.బీబీ పాటిల్ కు 10 సంవత్సరాలు అధికారం ఇస్తే కామారెడ్డి నియోజకవర్గానికి కూడా రాలేదు.అన్ని వర్గాలకు కార్పొరేషన్ల ద్వారా ఉపాధి కోసం నిధులు మంజూరు చేస్తాము.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేనీ సందీప్ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి పట్టణ యువజన అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ పంపరి లక్ష్మణ్.,బైరం కుమార్, మెదక్ నియోజకవర్గ సేవాధళ్ అధ్యక్షుడు ఎండి జహీరుద్దీన్, పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ మామిడి సిద్ధరాములు తదితరులు పాల్గొన్నరు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.