Monday, December 2, 2024

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జైభీమ్ రావ్ భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ ప్రచారం వేగం పెంచారు.

నారద వర్తమాన సమాచారం

నియోజకవర్గంలో జొన్నలగడ్డ విస్తృత ప్రచారం.

రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో ప్రజల నుంచి విశేష ఆదరణ

ఈవీఎం బ్యాలెట్ లో కోటు గుర్తు కే ఓటు వేసి అఖండ మెజార్టీ తో గెలిపించాలని వినతి

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జైభీమ్ రావ్ భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ ప్రచారం వేగం పెంచారు. మొన్నటి వరకు ఉదయం సాయంత్రం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల ను పలకరిస్తూ ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఇప్పుడు ప్రచార ఆటోను ఏర్పాటు చేసి వేకువ జామున నుంచే ఆటోలోనే తానుకూడా వెళ్తున్నారు. శుక్రవారం రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. పార్టీ సిద్ధంతాలు.. మ్యానిఫాస్టో రెండేళ్ల నుంచి నియోజకవర్గంలో బాధితుల తరుపున చేసిన చేసిన పోరాటాలు, సాధించిన విజయాలు భవిష్యత్ ప్రణాళిక తదితర విషయాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఈవీఎం బ్యాలెట్ *ఆరు * లో కోటు గుర్తు కే ఓటు వేసి అఖండ మెజార్టీ తో గెలిపించాలని కోరుతున్నారు.

ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్న వైనం.

యువకుడ్ని..,విద్యావంతుడ్ని… స్థానికుడైనడ్నినైన నేను మీ వాడ్ని…నిండు మనస్సు తో నన్ను ఆశీర్వదించండి….అన్న…ఏం చేస్తున్నారు…? ఏంటీ అమ్మా ఎలా ఉన్నారు…? అంటూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో మమేకమవుతున్నారు.. పార్టీ మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన నాయకత్వాన్ని బలపరిచి గెలిపించాలని కరపత్రాలను అందజేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు.. దీర్ఘకాలిక సమస్యలు, పిల్లల విద్యా, ఉపాధి తదితర విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జొన్నలగడ్డ విజయ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా బహుజనులు, అగ్రవర్ణాల్లో పేదలు నేటికీ సమాజానికి దూరంగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు అని చెప్పారు. వారికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం తీసుకొనిరావడానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్ఫూర్తి, మహాత్మ జ్యోతిబాపూలే ఆలోచనలు, కాన్షిరామ్ బాటలో నిరంతరం శ్రమిస్తున్న జడ శ్రవణ్ కుమార్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఈ ప్రాంతంలో సహజ వనరులు ప్రజలకు ఎలా ఉపయోగించాలనే విషయం పూర్తిస్థాయిలో అవగాహన ఉందని చెప్పారు. మొదటిసారిగా పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు..విద్యావంతుడైన నన్ను అసెంబ్లీకి పంపిస్తే మీ వాడ్ని అయిన నేను మన సమస్యలను అసెంబ్లీ వేదికగా చర్చిస్తానని పేర్కొన్నారు.. ఒక్క అవకాశం మీ బిడ్డకు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading