నారద వర్తమాన సమాచారం
పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో నీతి, నిజాయితీతో ఓటు వేయండి
ఈవీఎం బ్యాలెట్ నెంబర్ ఆరు లో కోటు గుర్తుకే ఓటేయండి
జైభీమ్ రావ్ భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పిలుపు.
రేపటి నుంచి జరగనున్న పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల ప్రలోభాలు, వత్తిడిలకు తలోగ్గకుండా నీతి నిజాయితీగా తమ అమూల్యమైన ఓటును కోటు గుర్తుకే వేసి తమకు మద్దతుగా నిలవాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐదున పీ.ఓ, ఏపిఓలు గజిటెడ్, నాన్ గజిటెడ్, వీఆర్వో, వీఆర్ఏ విద్యాశాఖ వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పాల్గొననున్నారని చెప్పారు. ఆరున పోలీసు, అగ్నిమాపక, అటవీ శాఖ, ఎన్ సి సి, ఇలా ఏకరూప దుస్తులు ( యూనిఫామ్ ) ఉద్యోగులన్నారు.ఏడున వివిధశాఖ ల్లో డ్రైవర్లు, ఎలక్ట్రిషన్సు, క్లీనర్స్, సాంకేతిక విభాగానికి చెందిన సిబ్బంది తదితరులు పాల్గొననున్నారని వివరించారు. అదేవిధంగా ఎనిమిదోవ తేదీన 85 సంవత్సరాలు వయస్సు పై పడిన వృద్దులు, తోమ్మిదిన దివ్యాంగుల ఇంటి వద్దకే సిబ్బంది వెళ్లి ఓటు వేయించుకుని వస్తారని ఆయన తెలిపారు. ఐదు నుంచి తొమ్మిది వరకు వివిధ శాఖల వారీగా జరుగుతున్న బ్యాలెట్ ఎన్నికల్లో ఉద్యోగులు నిజాయితీగా ఓట్లు వేయాలని ఆయన కోరారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బహుజన, అగ్రవర్ణాల్లో పేద కుటుంబాలకు చెందిన వారు తమ ఐక్యతను నిరూపించుకునే సమయం ఆసన్నమైందన్నారు.కోటు గుర్తు కు ఓటు వేసి తమ ఐక్యతను తెలియజేయాలని ఆయన కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.