నారద వర్తమాన సమాచారం
భావోద్వేగానికి గురైన ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి
కొంగుపట్టి ఓట్లు అభ్యర్థించిన మాజీమంత్రి సతీమణి వెంకటకుమారి
సోమవారం చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్‌లో నారీగళం పేరిట ఏర్పాటు చేసిన మహిళల ఆత్మీయ సమావేశం భావోద్వేగభరితంగా సాగింది. ప్రత్తిపాటికి మద్దతుగా తరలివచ్చిన మహిళల సమక్షంలో కొంగుపట్టి ఓట్లు అభ్యర్థిస్తున్నా అంటూ కన్నీటిపర్యంతమయ్యారు మాజీమంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి. పాతికేళ్ల ప్రస్థానంలో ప్రతిక్షణం చిలకలూరిపేట ప్రజల కోసమే ఆలోచించిన మంచి మనిషిపై గత ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలతో అభాండాలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ తప్పు చేయకున్నా
అవే తమ ఓటమికి కారణమయ్యాయని కన్నీళ్లు దిగమింగుకుని ప్రసంగించారామె. 2019లో వైకాపా తప్పుడు ప్రచారం, అబద్ధాలను నమ్మి చేసిన పొరపాటునే మరోసారి చేయవద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు వెంకటకుమారి. అవసరం ఉన్నవారికి ఒక్క పిలుపుతో అందుబాటులో ఉండే ప్రత్తిపాటిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నట్లు తెలిపారు. మంచిని ప్రోత్సహించండి, అభివృద్ధికి సహకరించాలన్నదే అందరికీ ఈ సందర్భంగా తన విన్నపం అన్నారామె. నారీగళం సభలో పెద్దసంఖ్యలో మహిళలను చూసిన తర్వాత ఆనందం, బాధ రెండూ కలిగాయని అందుకే కన్నీళ్లు ఆగలేదన్నారు. చిలకలూరిపేటలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారన్న వెంకటకుమారి ఈసారి ప్రత్తిపాటి పుల్లారావును గెలిపించాలని ప్రతి మహిళ కోరుకుంటున్నారని, కోరుకోవాలని తెలిపారు. పోయినసారి ఒక్క ఛాన్స్ అడిగిన జగన్ రెడ్డిని, అవినీతి మంత్రిని నమ్మినందుకు ఏం చేశారో అందరి కళ్లముందే ఉందన్నారు. ఇక్కడ ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత ప్రజలను వదిలేసి పారిపోయారని మండిపడ్డారు. ప్రత్తిపాటి ఎప్పుడూ పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా పనిచేశారని, మే 13న పోలింగ్ రోజు ప్రజలు ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే చాలన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.