
నారద వర్తమాన సమాచారం
జగన్ సొంత చెల్లెళ్లకు ఏ గతి పట్టించాడో ప్రజలు గమనించాలి: ప్రత్తిపాటి వెంకటకుమారి
అప్పాపురంలో ప్రత్తిపాటికి మద్దతుగా వెంకటకుమారి ప్రచారం
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సొంత చెల్లెళ్లకు ఏ గతి పట్టించాడో ప్రజలంతా గమనించాలని, ఇలాంటి వ్యక్తుల చేతుల్లో మరొక్కసారి రాష్ట్రాన్ని పెట్టే సాహసం ఎవరైనా చేస్తారా అని ప్రశ్నించారు మాజీమంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకట కుమారి. ఆడవాళ్లు అన్న కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా స్వార్థ రాజకీయం కోసం పేగుపంచుకుని పుట్టిన చెల్లినే అనరాని మాటలు అనిపిస్తున్న, తానే తిడుతున్న జగన్ దృష్టిలో మహిళల స్థానం ఏమిటో కూడా ఇవన్నీ చెబుతున్నాయి అన్నారామె. శుక్రవారం నాదెండ్ల మండలం అప్పాపురంలో కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా వెంకటకుమారి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. వారందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు రెట్టింపు సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు. అనంతరం మాట్లాడిన వెంకటకుమారి మోసాల పునాదులపై ఎదిగిన, మహిళలంటే ఏమాత్రం గౌరవం, మర్యాద లేని వైకాపా కావాలో ఆడవారికి ప్రపంచ స్థాయి గుర్తింపు తేవడంతో పాటు వారి అభివృద్ధి, సంక్షేమానికి సదా కట్టుబడి ఉన్న తెలుగుదేశం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. మే 13న జరగనున్న పోలింగ్‌లో ప్రత్తిపాటి పుల్లారావు, లావు శ్రీకృష్ణదేవరాయల్ని మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.









