ఎన్నికల విధులు నిర్వర్తించే పోలీస్ అధికారులు, సిబ్బంది పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా భాద్యతగా వ్యవ హారించాలి : జిల్లా ఎస్పీ సింధు శర్మ..
పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించాలి
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:మే10,
జిల్లా ఎస్పీ సింధు శర్మ పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా మే 13వ తేదీన జరగనున్న పోలింగ్ సందర్బంగా ఈవీఎంల తరలింపు,పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు.కళాభారతి నందు ఇట్టి సమావేశాన్ని నిర్వహించారు.ముఖ్యంగా రూట్ మొబైల్స్ ఇంచార్జి అధికారులకు పలు సూచనలు చేశారు.పోలింగ్ విధుల పట్ల అధికారులకు,సిబ్బందికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ప్రవర్తించే వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే అధికారులు చుట్టూ ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మన వంతు కృషి చేయాలని తెలియజేశారు.రౌడీ షీటర్లు,సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకొని ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాజల్ సింగ్ ట్రైని ఐపీఎస్,అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె.నరసింహారెడ్డి,
కామారెడ్డి డి.ఎస్.పి నాగేశ్వరరావు, ఎస్ బి సిఐ జార్జ్, టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి రూల్ సీఐ రామన్,ఎస్సైలు మరియు సిబ్బంది,ట్రైనీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.