నారద వర్తమాన సమాచారం
మే :16
కృష్ణా వివాదాలపై విచారణ జులై 15, 16 తేదీలకు వాయిదా
కౌంటర్ దాఖలుకు 4 వారాల గడువు
కృష్ణా జలాల వివాదాలపై తదుపరి విచారణను జులై 15, 16 తేదీలకు వాయిదా వేస్తూ కృష్ణా ట్రైబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)-2 నిర్ణయం తీసుకుంది.
జులై 8 లోగా డ్రాఫ్ట్ ఇష్యూలపై నివేదికలను సమర్పించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించింది. దిల్లీలో ట్రైబ్యునల్ ఛైర్మన్ బ్రిజేష్‌కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ తాళపత్ర సమక్షంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కౌంటర్ దాఖలుకు 4 వారాల సమయం కావాలని ఏపీ, 2 వారాల సమయం కావాలని తెలంగాణ కోరాయి.
రెండు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత కౌంటర్ దాఖలుకు ట్రైబ్యునల్ 4 వారాల సమయమిచ్చింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.