నారద వర్తమాన సమాచారం
మే :16
ప్రశాంత్ కిషోర్ కు కౌంటర్ ఇచ్చిన జగన్..
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
గురువారం ఐప్యాక్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆశ్చర్యానికి గురవుతుందని అన్నారు.
మరోసారి భారీ మెజార్టీతో వైసీపీ ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రశాంత్ కిశోర్ కూడా ఊహించలేనన్ని సీట్లు సాధించబోతున్నట్లు తెలిపారు. రాబోయే ప్రభుత్వం గతంలో మరింత మంచి చేసేందుకు కార్యచరణ రూపొందించినట్లు వెల్లడించారు.
22 ఎంపీ సీట్లు గెలుస్తున్నామని జోస్యం చెప్పారు.
రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని అన్నారు.
2019 లో చూసిన విజయానికి కంటే మరింత భారీ విజయం(151 సీట్లు) సాధించబోతున్నామని అన్నారు.
కాగా, ఏపీ ఫలితాలపై ఇటీవల ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో జగన్ తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని అభిప్రాయం వ్యక్త పరిచారు.
గడిచిన ఐదేళ్లలో జగన్ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరించారని అన్నారు.
ఆయన ప్రొవైడర్ మోడ్ లోనే ఉండిపోయారని, చక్రవర్తుల మాదిరిగా తాయిలాలతోనే సరిపెట్టారని విమర్శించారు. ఆయన పాలనలో అనేక తప్పిదాలు జరిగాయని వాటిలో ప్రజగలకు నగదు బదిలీ చేసి ఉద్యోగాలు కల్పించలేదని వివరించారు.
ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ మాదిరిగానే పనిచేశారని పేర్కొన్నారు. తాజాగా.. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై జగన్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.