నారద వర్తమాన సమాచారం
మే :16
రెడ్ బుక్ కేసు విచారణలో కీలక అప్ డేట్
విజయవాడ: ఏపీఏసీబీ కోర్టులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ రెడ్ బుక్ కేసుపై బుధవారం విచారణ జరిగింది..
నారా లోకేష్‌ను అరెస్ట్ చేయాలని ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. రెడ్ బుక్‌లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41ఏ నిబంధలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని సీఐడీ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. కౌంటర్, అబ్జెక్షన్లు వినేందుకు సమయం ఇవ్వాలని న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కోరారు. ఈ కేసు విచారణను జూన్ 18కి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
కాగా.. నారా లోకేష్ గత ఏడాది యువగళం పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో లోకేష్ రెడ్ బుక్ – రెడ్ బుక్.. అంటూ కామెంట్లు చేశారు. కొంత మంది ఏపీ పోలీసులు, సీఐడీ అధికారులు టీడీపీ నాయకులపైనా.. తనపైనా దాడులు చేస్తున్నారని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం చెప్పినట్లే అధికారులు నడుచుకుంటున్నారని వీరిపై టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ హెచ్చరించారు. వీరి పేర్లను ఈ రెడ్ బుక్‌లో నమోదు చేస్తున్నానని లోకేష్ చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలను ఏసీబీ కోర్టు సీరియస్‌గా పరిగణించింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.