నారద వర్తమాన సమాచారం
పెండింగ్ లో ప్రభుత్వ ఉద్యోగుల డి ఏ
హైదరాబాద్
మే :19
అనుకున్నదొక్కటే అయింది అన్నట్లుగా తమ పరిస్థితి మారిందని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి.
వారితోపాటు కార్మికులు, పెన్షనర్లు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొత్త హామీలు దేవుడెరుగు ఎన్నికల ముంగిట ఇచ్చిన హామీలనూ అమలు చేయడం లేదని ఆందోళన చెందుతున్నారు.
ఎన్నికల సంఘం అనుమ తించినా గతంలో కేసీఆర్ విడుదల చేసిన డీఏను చెల్లించేందుకూ కాంగ్రెస్ సర్కారుకు చేతులు రావడం లేదని ఆవేదన చెందుతు న్నారు.
తమకు న్యాయంగా దక్కా ల్సిన సౌకర్యాలను కల్పించ కపోగా ‘మీరే చూస్తున్నారు గా..’ అని నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నారని వాపోతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో తామిచ్చిన వినతలు సంబంధిత శాఖలకు చేరేవని, ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించేవా రని, ఇప్పుడా పరిస్థిలే లేద ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ప్రస్తుతం సీఎంకు, మంత్రు లకు సమర్పించిన వినతి పత్రాలు ఎక్కడికి వెళ్తున్నా యో అర్థమే కావడం లేదని చెప్తున్నారు. అసలు మంత్రు లు తామేం చెప్తున్నామో కూడా వినకుండానే ‘ఓకే.. చూద్దాం.. చేద్దాం’ అంటూ కాగితాలను పారేస్తున్నారని అంటున్నారు.
బదిలీల విషయంలో ప్రభు త్వానికి ఒక విధానమంటూ లేకుండాపోయిందని ఉద్యో గులు ఆరోపిస్తున్నారు. ఇక విద్యాశాఖ విషయానికి వస్తే అప్పటికప్పుడు 317 జీవో పై మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే వేశారు
కానీ, దానిపై ఏం చేయబో తున్నారో అన్నదానిపై సర్కారుకు ఇంకా స్పష్టత రాలేదని ఉపాధ్యాయ సంఘాలు ధ్వజమెత్తుతు న్నాయి.
మొత్తానికి రాష్ట్రం లో కాంగ్రెస్ సర్కారు కొలు వుదీరి ఆరు నెలలు కావస్తున్నా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్న హామీల్లో తక్షణం పరిష్కరించగలిగిన వాటినైనా అమలు చేయడం లేదని ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.