నారద వర్తమాన సమాచారం
మే :20
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తనదైన డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు.
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన ఏజెన్సీ జిల్లాల్లో పార్లమెంట్ ఎన్నికల బందోబస్తును సక్సెస్ ఫుల్ గా నిర్వహించిన సందర్భంగా గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేశారు.
పాల్వంచలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఈ పార్టీలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పోలీస్ సిబ్బందితో కలిసి సరదాగా డ్యాన్స్ చేసి అలరించారు.
ఎప్పుడు తనిఖీలు, కేసుల వేటలో బిజీగా ఉండే పోలీసు అధికారులు ఇలా కాస్త రిలాక్స్ గా తెలుగు పాటలకు స్టెప్పులు వేసి అదరహో అనిపించారు.
జిల్లా ఎస్పీ సైతం తమతో పాటు డ్యాన్స్ చేసేందుకు కాలు కదపడంతో సిబ్బంది అంతా చిల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.