నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా
కొండ గురవయ్య స్వామి తిరునాళ్ళు ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రత,బందోబస్తు ఏర్పాటు: పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్
ఐనవోలు పోలీస్ స్టేషన్ పరిధి నూజెండ్ల మండలం రవ్వారం గ్రామం నందు ది.12.02.2025 వ తేదీన కొండ గురవయ్య స్వామి తిరునాళ్ల ను పురస్కరించుకొని అక్కడ ఏర్పాటు చేయవలసిన బందోబస్తు గురించి జిల్లా ఎస్పీ స్వయంగా వెళ్లి పరిశీలించారు.
ఆలయ పరిసరాలు, దర్శనానికి వెళ్లే ప్రవేశ, ఎగ్జిట్ క్యూలైన్ల మార్గాల వద్ద భద్రతా మరియు బందోబస్తు పై అధికారులకు పలు సూచనలు తెలియచేసినారు.
భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా పటిష్టమైన బందోబస్తు నడుమ ప్రశాంతంగా భక్తులు దర్శనం జరిగేలా చూడాలని,పార్కింగ్, ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
డ్రోన్/ సీసీ కెమెరాల నిఘా తో ఉంచాలని, తిరునాళ్ల లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరు ఎవరికి నియమించిన స్థానంలో వారు ఉంటూ భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి తిరునాళ్ళు జరిగే సమయంలో ఎలాంటి తోపులాటలు,
అవాంతరాలు జరగకుండా విజయవంతంగా ముగిసేలా సమన్వయం, సమయస్ఫూర్తి తో విధులు నిర్వర్తించాలని అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు.
ఈ తిరునాళ్ల కు పల్నాడు,గుంటూరు, బాపట్ల,ప్రకాశం జిల్లాల నుండి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రద్దీని దృష్టిలో ఉంచుకుని మిగిలిన శాఖల వారితో సమన్వయ పరచుకుంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని తెలిపారు.
అనంతరం రవ్వారం నుండి ఐనవోలు పోలీస్ స్టేషన్ ను ఎస్పీ విజిట్ చేసి రిసెప్షన్ లో ఉన్న మహిళా కానిస్టేబుల్ తో ఫిర్యాదుల గురించి,రికార్డుల మైంటేనెన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు.
జిల్లా ఎస్పీ వెంట నరసరావుపేట డిఎస్పీ K. నాగేశ్వరరావు , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్-1 B. సురేష్ బాబు ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్-2 పి.శరత్ బాబు , వినుకొండ రూరల్ సిఐ ప్రభాకర్ ,
ఐనవోలు ఎస్సై B. కృష్ణా రావు శావల్యాపురం ఎస్ఐ లోకేశ్వర రావు మరియు సిబ్బంది ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.