నారద వర్తమాన సమాచారం
అమరావతి, క్రోసూరు మండలాల్లో తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే
పల్నాడు జిల్లా, 5 ఫిబ్రవరి, 2025. : అమరావతి మండలంలో లింగాపురం గ్రామంలో, క్రోసూరు మండలం నిర్మాణంలో ఉన్న పంపు హౌస్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే ఆకస్మిక తనిఖీ చేశారు.
పల్నాడు జిల్లాలో ఈ రెండు మండలాల గుండా వెళ్లే గోదావరి నీళ్లు పెన్నా నదికి మధ్యలో ఉన్నా అమరావతి, క్రోసూరు మండలాల మధ్య నీరు వెళ్ళనున్న దృష్ట్యా, ఆ పనిని మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఇంజనీర్లతో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే, సత్తెనపల్లి ఆర్డీవో రమణ కాంత్ రెడ్డి, అమరావతి తహశీల్దార్, క్రోసూరు తహశీల్దార్, జల వనరుల శాఖ అధికారులు, సర్వేయర్లు, వీఆర్వోలు సేకరించాల్సిన భూమిని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఏఈ ఇరిగేషన్, మెగా ఇంజనీరింగ్ శాఖ ఇంజనీర్లు, సర్వేయర్లు, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.