నారద వర్తమాన సమాచారం
02-09-2009 న ఏం జరిగింది?:19-05-2024న ఎం జరిగింది
హైదరాబాద్
:మే 20
నిన్న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. హెలికాప్టర్ ప్రమదాల్లో ఎలా మరణించారు?ఈరోజు ప్రధాన చర్చ అంశంగా మారింది…
తొలుత ఏటీసీతో సంబం ధాలు తెగిపోయిన రైసీ హెలికాప్టర్ కోసం రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఒక రోజు తర్వాత రైసీ ప్రయా ణించిన హెలికాప్టర్ కూలిపోయిందని అధికా రులు ప్రకటించారు.
ఈ ప్రమాదంలో రైసీ మరి కొందరు మృతి చెందారు. ప్రతికూల వాతావరణం కారణంగానే రైసీ ప్రయా ణించిన హెలికాప్టర్ కూలి పోయిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం గుర్తుకు వస్తుంది. 2009లో ఏం జరిగింది?
2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి రెండోసారి సీఎం గా బాధ్యతలు చేప ట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు రచ్చబండ కార్యక్రమం ప్రారంభించాలని భావించారు.
చిత్తూరు జిల్లాలో రచ్చ బండ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ లో హైద్రాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి చిత్తూరు జిల్లాకు బయలుదేరారు.
బేగంపేట విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. సీఎం ప్రయాణీస్తున్న హెలికాప్టర్ మిస్సింగ్ కావడంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
రక్షణ శాఖకు చెందిన ఆధునాతన విమానాలు, హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. నల్లమల అడవు ల్లోని పావురాలగుట్ట వద్ద వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ శకలాలను గుర్తించారు.
ఈ ప్రమాదంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సహా వ్యక్తి గత సిబ్బంది మృత్యువాత పడ్డారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇబ్రహీం రైసీ ఉపయో గించింది బెల్ హెలికాప్టర్లే మే 19వ తేదీన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇరాన్-అజర్ బైజాన్ సరిహద్దు నుండి తబ్రిజ్ పట్టణానికి బెల్ 212 హెలికాప్టర్ లో బయలు దేరారు.
రైసీ ప్రయాణిస్తున్న హెలి కాప్టర్ ప్రతికూలవాతావ రణం కారణంగా కుప్ప కూలింది. టేకాఫ్ అయిన 30 నిమిషాలకే ఈ హెలి కాప్టర్ కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయా యి.
దీంతో అధికారులు అధ్య క్షుడి హెలికాప్టర్ కోసం గాలింపు చర్యలు చేప ట్టారు. కానీ, మే 20న ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ను రెస్క్యూ టీమ్ గుర్తించింది.
2009లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రయా ణించింది, బెల్ 430 హెలికాప్టర్.ఈ హెలికా ప్టర్లను తయారు చేసింది అమెరికాకు చెందిన బెల్ టెక్స్ ట్రాన్ కంపెనీ తయారు చేసింది.
రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూడ ప్రతికూల వాతావ రణం కారణంగా నల్లమల అడవుల్లో కూలిపోయిం ది.ఒక్క రోజు తర్వాత ఈ విషయాన్ని ఆర్మీ హెలికాప్టర్ గుర్తించింది.
ఈ రెండు ప్రమాదాలను ఒకే రకంగా కన్పిస్తున్నాయి. ప్రతికూల వాతావరణంలో ఈ రెండు హెలికాప్టర్లు కూలిపోయాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత హెలికాప్టర్లు కుప్పకూలి పోయాయి…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.