నారద వర్తమాన సమాచారం
మే :22
సతైనపల్లి
ఎన్నికల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా అనర్హత వేటు వేయాలి.
ఈవీఏం లు పగలగొట్టిన అభ్యర్థులపై ఎన్నికల కమీషన్ కొరడా జలిపించాలి.
జైభీమ్ రావ్ భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, పల్నాడు జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ డిమాండ్.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పోలింగ్ రోజున బూతుల్లోకి వెళ్లి ఈవీఏం ధ్వంసం చేసిన వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా అనర్హత వేటు వేయాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయా లేదా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు రాచమార్గంగా పోలింగ్ బూతులోకి వెళ్లే అధికారాన్ని రాజ్యాంగాన్ని అనుసరించి ఎన్నికల కమిషన్ కల్పించిందన్నారు. లోపలకెళ్లి ఓటింగ్ సరళి తదితర విషయాలు పరిశీలించాలే గాని ఈవీఎంలు పగలగొట్టడానికి కాదని పేర్కొన్నారు. అభ్యర్థి వ్యవహార శైలి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే అతన్ని భవిష్యత్తులో ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించేలా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమీషన్ కు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో రెండ్రోజులుగా చక్కర్లు కొడుతున్నాయన్నారు. ప్రజాప్రతినిధి, మాజీ విప్ అయినటువంటి పిన్నెల్లి ఇటువంటి ఘటనలకు పాల్పడటం హేయమైన చర్యన్నారు. భవిష్యత్తు ల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అదేవిధంగా గుంతకల్లు టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థి మధుసుధన్ గుప్తా కూడా ఈవీఎం పగలగొట్టిన వీడియో చక్కర్లు గోడుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల రోజు అభ్యర్థులు ఎక్కడైన ఇటువంటి ఘటనలకు పాల్పడుతే వారందరి పైన శాఖాపరమైన చర్యలతో పాటు శాశ్వత అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.