నారద వర్తమాన సమాచారం
మే :23
పల్నాడు జిల్లా
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జె ఎన్ టి యు కళాశాల ప్రాంగణంలో గల స్ట్రాంగ్ రూమ్ వద్ద పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాత్కర్ తో కలిసి భద్రత ఏర్పాట్లను పరిశీలించిన పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్ ఐపీఎస్
ఎలక్షన్ కౌంటింగ్ కు సంబంధించి జిల్లాలో ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్ ఐపీఎస్
జూన్ 4 న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ నిమిత్తం స్ట్రాంగ్ రూం ల వద్ద, జె ఎన్ టి యు కళాశాల ప్రాంగణంలో, చుట్టు పక్కల ప్రాంతాలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి జిల్లాలో ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్ ఐపీఎస్ హెచ్చరించారు.
ఎన్నికల కౌంటింగ్ జరుగు ప్రదేశానికి నిర్ణీత దూరంలో వెహికల్స్ పార్క్ చేసి రావాలని ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లాలో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సమస్యాత్మక గ్రామాలలో, ముఖ్యమైన ప్రదేశాలలో, ప్రధాన కూడళ్లలో పోలీస్ బలగాలతో పికెట్ లను ఏర్పాటు చేస్తున్నాం అని ఎస్పీ తెలియజేశారు.
ఎన్నికల కోడ్, సెక్షన్ 144 సీఆర్పీసీ, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున, ఏ ప్రాంతంలో కూడా నలుగురు కన్నా ఎక్కువ మంది ఒక చోట గుమికూడి ఉండరాదని, బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు.
ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పెట్రోల్ బంక్ లలో పెట్రోల్, డీజిల్ లను వాహనాలలో మాత్రమే నింపాలని, విడిగా బాటిల్స్ లో పొయ్యరాదని, ఏ పెట్రోల్ బంక్ వారు అయిన నిబందనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా ప్రతినిధులు,ప్రజలు ఎన్నికల కౌంటింగ్ సమయంలో భాద్యతగా వ్యవహరించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ వారికి సహకరించి, వారి ముందస్తు సూచనలు, సలహాలు పాటించాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రాఘవేంద్ర రావు,నరసరావుపేట డీఎస్పీ సుధాకర్ రావు , ఎస్ బి సిఐ సురేష్ బాబు ,నరసరావు పేట రూరల్ సీఐ మరియు ఎస్ఐలు పాల్గొన్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.