నారద వర్తమాన సమాచారం
మే :23
పొలిటికల్ ఎనాలసిస్ !
యరపతినేని మంత్రిగా కాబోతున్నాడా?
యరపతినేని మూడుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా,, పల్నాడుకు పెద్ద దిక్కు లాగా టిడిపికి అండగా ఉన్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు
కానీ పల్నాడు కి ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మంత్రి పదవి అందని ద్రాక్ష లాగానే మిగిలిపోయింది గురజాల మాచర్ల నియోజకవర్గాలలో మంత్రి పదవి అనేది ఇప్పుడు దాకా కూడా రాలేదు ఎన్ డి ఏ ప్రభుత్వం గనుక వస్తే యరపతినేనికి మంత్రి పదవి ఇస్తారు అనేది టిడిపి సర్కిల్లో, మీడియా సర్కిల్లో, బాగా చర్చలు జరుగుతున్నాయి
పల్నాడు జిల్లాలో టిడిపి పరంగా మనం ఒకసారి పున పరిశీలించినట్లయితే,
చిలకలూరిపేట: పత్తిపాటి పుల్లారావు గతంలో కూడా మంత్రిగా చేసి మరలా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు, కానీ పుల్లారావు ఆర్థికంగా బలంగా ఉన్నారు అనేది చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల వాదన, ఒక్కసారి మినిస్టర్గా చేసి మరొక్కసారి మినిస్టర్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు అనేది చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు?
వినుకొండ :జీవి ఆంజనేయులు గతంలో ఎమ్మెల్యేగా చేసి, పల్నాడు జిల్లా అధ్యక్షులుగా కూడా చేసి ఉన్నారు వినుకొండ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులోనే ఉంటూ, వారి ట్రస్టు ద్వారాఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు,
జీవి ఆంజనేయులు కి ఆర్థికంగా బలంగానే ఉన్నారు అని ప్రజల వాదన? జీవి ఆంజనేయులు కూడా మంత్రి పదవి రేసులో ఉండవచ్చు అనేది నా అంచనా?
సత్తనపల్లి : కన్నా లక్ష్మీనారాయణ గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో మంత్రిగా చేసి ఉన్నారు, రాజశేఖర్ రెడ్డి టైంలో కిరణ్ కుమార్ రెడ్డి టైంలో మంత్రి పదవి చేసి ఉన్నారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా చేసి ఉన్నారు పల్నాడు జిల్లాలో సీనియర్ పొలిటిషన్ గా ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చి ఉన్నారు, కన్నా కాపు కులానికి సంబంధించిన వ్యక్తి కుల సమీకరణలో గనుక ఇవ్వవలసిన పరిస్థితి ఉంటే కన్నా కూడా రేసులో ఉండవచ్చు
ఎన్డీఏ ప్రభుత్వం గనుక వస్తే పల్నాడు జిల్లా నుంచి యరపతినేని కి క్యాబినెట్లో చోటు దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి
పై తెలుపబడిన విషయాలన్నీ కూడా నా సొంత అభిప్రాయం మాత్రమే తెలియజేస్తున్నాను.
ఇట్లు.
మీ అంబటి. నవకుమార్
మాజీ.ఎంపీపీ. దాచేపల్లి…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.