నారద వర్తమాన సమాచారం
మే :24
చిలకలూరిపేట పురపాలక సంఘ అధికారిపై విజిలెన్స్ రహస్య విచారణ..!?
చిలకలూరిపేట పురపాలక సంఘ పరిధిలో అన్ని శాఖల కంటే రెవెన్యూ అంటే తమకు ఇన్కమ్ వచ్చేదాన్ని రెవెన్యూ అనుకుంటున్నారుమున్సిపల్ రెవిన్యూ అధికారి. ఏకంగా ముగ్గురు ఆర్ ఐ లను పెట్టుకొని ఒక్కొక్క రంగంలో నిష్ణాతులైన వారి ద్వారా అక్రమ వసూళ్లు చేసుకోవటమే పనిగా పెట్టుకున్నాడు చిలకలూరిపేట మున్సిపల్ రెవిన్యూ అధికారి. గతం కంటే భిన్నంగా చిలకలూరిపేటలో రావాల్సిన బకాయిలకు అతను ఏమాత్రం పట్టించుకోడు. కానీ తనకు రెవిన్యూ రాకపోతే ఆ రోజుల్ల అధికారులపై చిందులు తోక్కుతూ ఉంటాడు. రోజు చేయి తడవనిదే ఇంటికి వెళ్ళని మహానుభావుడు చిలకలూరిపేట రెవెన్యూ అధికారి. గతంలో అధికారులు ఇళ్ళ చుట్టూ తిరిగి ట్యాక్స్ వసూలు చేస్తే ఈయన మాత్రం ఏసీ క్యాబిన్ ఏర్పాటు చేసుకొని సపరేట్గా రూమ్ లో కూర్చుని ముగ్గురు ఆర్ ఐ లను నియమించి ,ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ఎంత ఎంత ఆదాయం వస్తుందని ఆలోచించి ఖాళీ స్థలాలకు పన్ను వేయటం ద్వారా ఎక్కువ రాబడిని అర్జించాడు ఈ రెవెన్యూ అధికారి. ఈ అధికారిపై పలు ఆరోపణలు వచ్చాయి. గతంలో అధికారులు రెవిన్యూ సెక్షన్ లో పనిచేసే వారు మున్సిపల్ కమిషనర్ అయినా సంఘటన కూడా ఉన్నాయి. అయితే ఇందుకు భిన్నంగా ఈ అధికారి పై ఉన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు చిలకలూరిపేటకు వచ్చి రహస్యంగా విచారణ జరుగుతున్నట్లు విశ్వసినియంగా తెలిసింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.