నారద వర్తమాన సమాచారం
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనవలసిందిగా శాసనసభ్యులు ప్రత్తిపాటిపుల్లారావు ని ఆహ్వానించిన మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ.
ఆగస్టు15 వ తేదిన 78 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చిలకలూరిపేట పట్టణములో పురపాలక సంఘం నందు జరగబోవు వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వలసిందిగా మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ని చిలకలూరిపేట పురపాలక సంఘ చైర్మన్ రఫాని మరియు కౌన్సిల్ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేసి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటీ పుల్లారావు మున్సిపల్ చైర్మన్ ను శాలువాతో సత్కరించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి కౌన్సిలర్లు గంగ శ్రీనివాసరావు, పాములపాటీ శివ కుమారి, జాలాది సుబ్బారావు, వైసిపి కౌన్సిల్ సభ్యులు వలేటి వెంకటేశ్వరరావు, నాయబు సైదాబి, వడితే కోట నాయక్, విల్సన్ మస్తాన్వలి తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.