నారద వర్తమాన సమాచారం
మే :31
క్షయ పై పోరులో పెద్దలకు బి సి జి టీకా :
వైద్యాధికారిని సిరి చందన
క్షయ వ్యాధిపై పోరును మరింత తీవ్రతరం చేయాలని ప్రభుత్వం సంకల్పించిన సందర్భంగా వయోజనులకు బి సి జి టీకా ఇవ్వడానికి రంగం సిద్ధమైనట్లు పల్నాడు జిల్లా కోసూరు మండలం క్రోసూరు పిహెచ్సి వైద్య అధికారిని డాక్టర్ సిరి చందన అన్నారు గురువారం ఆమె హసన్ బాద్ సచివాలయంలో జరుగుతున్న వయోజన బీసీజీ టీకా కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 20 25 నాటికి క్షయ వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించాలనే లక్ష్యంతో 18 ఏళ్లు పైబడిన వారికి టీకా వేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించినట్లు ఆమె పేర్కొన్నారు 60 సంవత్సరాలు పైబడిన వారు, 18 నుంచి 60 సంవత్సరాల లోపు పొగ తాగేవారు, 18 నుంచి 60 సంవత్సరాల లోపు మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఎత్తు, బరువుల నిష్పత్తి బి ఎం ఐ బాడీ మాస్ ఇండెక్స్ 18 కంటే తక్కువ ఉన్నవారికి, క్షయ వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులకు, 2018 నుంచి టీబి బారిన పడి చికిత పొందుతున్న వారు, 2021 వ సంవత్సరం జనవరి 1 నుంచి టీబి వ్యాధిగ్రస్తులతో కాంటాక్ట్ లో ఉన్నవారు ఈ వయోజన బీసీ జి వ్యాక్సిన్ వేయించుకునేందుకు అర్హులని ఆమె తెలిపారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపల వారు, గర్భిణీలు, బాలింతలు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ పేషెంట్లు, మూడు నెలల లోపల రక్తమార్పిడి చేయించుకున్న వారు, వ్యాక్సిన్ చేయించుకోవడానికి నిరాకరించిన వారు, బీసీజి , ఇతర వ్యాక్సిన్ లకు గతంలో తీవ్ర రియాక్షన్ వచ్చిన వారికి ఈ వ్యాక్సిన్ అవసరం లేదని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా, పురుష ఆరోగ్య కార్యకర్తలు, హెల్త్ సూపర్వైజర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.