Thursday, May 1, 2025

తెలంగాణ రాష్ట్రాన్ని వణికించిన గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తులు ఏమయ్యాయి? నయీం ఆస్తులు అలానే ఉన్నాయా? పరాధీనం అయ్యాయా? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. షాద్ నగర్ లో గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తర్వాత ఆరోజు స్వాధీనం చేసుకున్న ఆస్తి పత్రాలు నగలు నగదు ఏమయ్యాయని ప్రశ్న మొదలవుతుంది.

నారద వర్తమాన సమాచారం

షాద్ నగర్ ఎన్ కౌంటర్” సొమ్మంతా యాడికి పోయింది..?

గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తులు ఏమయ్యాయి సారూ..?

నయీం ఆస్తులపై సీఎం రేవంత్ న్యాయవిచారణ చేయిస్తారా..?

షాద్ నగర్ లో దొరికిన ఆస్తులు నగదు, పత్రాలు ఏమయ్యాయి

దొరికిన నగదు పై చిదంబర రహస్యం

హత్యలు, కిడ్నాప్‌లు, భూకబ్జాలతో తెలంగాణ రాష్ట్రాన్ని వణికించిన గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తులు ఏమయ్యాయి? నయీం ఆస్తులు అలానే ఉన్నాయా? పరాధీనం అయ్యాయా? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. షాద్ నగర్ లో గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తర్వాత ఆరోజు స్వాధీనం చేసుకున్న ఆస్తి పత్రాలు నగలు నగదు ఏమయ్యాయని ప్రశ్న మొదలవుతుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అప్పటి షాద్ నగర్ లో ఈ ఎన్కౌంటర్ సమయంలో అప్పటి ఎస్పీ రెమా రాజేశ్వరి
మీడియాను ఎవరిని ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవరిని దగ్గరికి రానివ్వలేదు కొంతమంది స్థానిక జర్నలిస్టులు సంఘటన స్థలానికి వెళితే వాళ్లను మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఉదయం నుండి సాయంత్రం దాకా సాగిన ఈ తంతులో మొట్టమొదట అక్కడ చేరుకున్న జర్నలిస్టులు అనేక చిత్ర విచిత్ర విన్యాసాలు చూశారు. అనేక రూపకల్పనలు జరిగిన దాఖలాలు అక్కడ కనిపించాయి. కానీ అప్పటి కెసిఆర్ ప్రభుత్వం ఇదంతా డ్రామా చేయించి మీడియాను దగ్గరకు కూడా రాకుండా చేశారనేది వాస్తవం.

షాద్ నగర్ పట్టణంలోని మిలీనియం టౌన్ షిప్ లో జరిగిన ఆ ఎన్ కౌంటర్ సంఘటనలో అక్కడికి శీఘ్రంగా వెళ్లిన స్థానిక జర్నలిస్టులు కొందరు మొదట ఉన్న పరిస్థితులు ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్ని కళ్లకు కట్టినట్టు చెబుతారు. డబ్బు లెక్కింపుకు వచ్చిన పరికరాలు, డిసిఎం వాహనాల నిండా సొత్తు తీసుకెళ్లిన దాఖలాలు, పత్రాలు విలువైన వస్తువులు ఎన్నో ఊడ్చిపెట్టుకుని మరి తీసుకుపోయారు. కానీ అదంతా ఏమైందో ఇప్పటివరకు స్థానిక మీడియాకు కూడా వెల్లడించలేదు. ఇంకెవరికి కూడా తెలియదు.. ఈ ఎన్ కౌంటర్ అంతా చిదంబర రహస్యమే. అయితే
నయీం ఆస్తులపై సస్పెన్స్ తీరేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని షాద్ నగర్ లో పలువురు కోరుతున్నారు. గ్యాంగ్‌స్టర్ నయీంను ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో 2016 ఆగస్టు 9న ప్రత్యేక బృందం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే.

ఆయనపై అనేక చోట్ల నమోదైన 197 కేసులను దర్యాప్తు చేసేందుకు అప్పటిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌) ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలోనే నయీం అక్రమంగా సంపాదించిన ఆస్తులను సిట్ వెలుగులోకి తెచ్చింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల్లో నయీంకు స్థిరాస్తులు ఉన్నట్లు సిట్‌ అప్పటిలో నిర్ధారించింది. నయీం పైనా ఆయన బినామీల పేరిట ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ.1,200 కోట్లు ఉండొచ్చని ఆదాయపు పన్ను శాఖ కూడా అప్పటిలో అంచనా వేసింది.

షాద్ నగర్ ఎన్ కౌంటర్ ద్వారా..

షాద్ నగర్ ఎన్ కౌంటర్ ద్వారా అప్పట్లో పోలీసులు కొన్ని విషయాలు మాత్రమే మీడియా దృష్టి తెచ్చారు.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల్లో 1015 ఎకరాల భూములు, లక్షా 67 వేల 117 చదరపు అడుగుల ఇళ్ల స్థలాల్ని ఎన్ కౌంటర్ తర్వాత సిట్‌ గుర్తించింది. నయీం డెన్‌లో నిర్వహించిన సోదాల్లో 2 కోట్ల 8 లక్షల 52 వేల 400 రూపాయల నగదుతోపాటు 1.90 కిలోల బంగారు ఆభరణాలు, 873 గ్రాముల వెండి వస్తువులు, 258 సెల్‌ఫోన్లు, వేర్వేరు వ్యక్తుల పేర్లతో ఉన్న 203 రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు, పేలుడు పదార్థాలు, ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాల్ని అప్పటిలో పోలీసులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే షాద్ నగర్ విలీనం టౌన్షిప్ లో పెద్ద ఎత్తున లభించిన నగదు వస్తువులు ఆస్తి పత్రాలు బయటికి రాలేదనే విమర్శ ఉంది.
నయీం ఇంట్లో పట్టుబడ్డ వంటమనిషి ఫర్హానా పేరిట హైదరాబాద్‌, సైబరాబాద్‌తో పాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో సుమారు 30 నుంచి 40 ఇళ్లు, ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఫర్హానా పేరుతో ఉన్న ఆస్తుల విలువే వందల కోట్లు ఉంటుందని సమాచారం. చరాస్తుల గురించి అనుమానం లేకపోయినా కూడా స్థిరాస్తుల గురించి మాత్రం పలు అనుమానాలు చెలరేగుతున్నాయి. ఆ ఆస్తులన్నీ కూడా పరాధీనం అయ్యాయని కూడా కొందరు అంటున్నారు. రాజకీయ నాయకులు ఆ ఆస్తులను గుర్తించి తమ పేరిట మార్చుకున్నారని కూడా అంటున్నారు. అప్పటిలో నయీం తన పేరు మీద, తన కుటుంబ సభ్యులు, అనుచరుల పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములను ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకుంటుందనేది సమస్యగా ఉండేది. ఒకసారి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వ్యక్తేకే అన్ని హక్కులూ లభిస్తాయి.
బెదిరింపులతో ఆస్తులు కూడపెట్టుకున్నా అన్ని ఆస్తులను సంపాదించే శక్తి నయూంకు లేదన్న కారణాలతో అక్రమాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అప్పటిలో అనుకున్నారు. అయితే అక్రమాస్తులను బాధితులకు అప్పగించే విషయంలో చట్టపరమైన సమస్యలు వస్తాయని కూడా అప్పటిలో భావించారు. బెదిరించి బలవంతంగా తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములు కాబట్టి వాటిని బాధితులకు అప్పగించాలనే వాదన ఉంది. ఆ దిశగా కూడా కొంత ప్రయత్నం చేశారు. ఆ ముసుగులో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇప్పుడున్న ప్రభుత్వానికి కొందరు ఉప్పందిస్తున్నారు.
పోలీసు అధికారులు, ప్రభుత్వ పెద్దలు కూడా దాన్ని తొలుత సమర్థించారు. ఈ ప్రక్రియ న్యాయస్థానం ద్వారానే జరగాల్సి ఉంటుంది. అయితే, ఆక్రమించుకున్న ఆస్తులు బాధితులకు అప్పగించేందుకు సాంకేతికపరమైన సమస్యలు వచ్చాయి. ఆక్రమణల్లో నయీం చట్టబద్దమైన వ్యూహాన్ని అనుసరించాడు.

నయీం రెండు రకాలుగా ఆస్తులు సంపాదించేవాడు. తన అనుచరుల ద్వారా ఆస్తుల సమాచారం సేకరించి, వాటి యజమానులకు ఎంతో కొంత ముట్టజెప్పి ఆక్రమించుకునే వాడు. ఎవరైనా భాగస్వామ్య వివాదాలతో తన వద్దకు వస్తే ఇద్దర్నీ కాదని ఆ ఆస్తిని తనపరం చేసుకునేవాడు. ఆక్రమించుకున్న ఆస్తులను నయానోభయానో చట్టబద్ధంగా తన పేరుతోనే, అనుచరులు, బంధువుల పేరుతోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకునేవాడు. సంబంధిత దస్త్రాలన్నీ తన వద్దనే ఉంచుకునేవాడు.

అయితే ఎన్ కౌంటర్ తర్వాత నయీం భూములు ఏమయ్యాయి అనే అంశంపై ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయి న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ వినిపిస్తున్నది. చూడాలి మరి సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తారో.
ఆ చిదంబర రహస్యాన్ని ఎలా బయటికి తీస్తారు వేచి చూడాలి. షాద్ నగర్ ఎన్కౌంటర్ పై అన్ని అనుమానాలే ఉన్నాయన్నది మాత్రం అందరికి తెలిసిన విషయమే.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version