నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్,
01.6.2024.
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా అక్రమ మద్యం,మారణాయుధాలను నేరస్తులను గుర్తించడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా నాకాబంది- పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్ ఐ పీ ఎస్
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు ఇంకా కొద్ది రోజులే ఉన్నందున జిల్లాలోకి ఎటువంటి అసాంఘిక శక్తులు, అక్రమ మద్యం, మారణాయుధాలు రవాణా కాకుండా నిలువరించడానికి నిన్న అనగా 31.5.2024 న నాకాబందిని నిర్వహించామని ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..
జిల్లా వ్యాప్తంగా 34 పోలీస్ స్టేషన్ల పరిధిలో ముఖ్యమైన ప్రదేశాలలో నాకాబంది/వాహనాల తనిఖీ చేయడం జరిగిందని ఈ వాహనా తనిఖీ యొక్క లక్ష్యం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయడమే అని ఈ నాకాబందీలో దాదాపుగా 34 పోలీస్ స్టేషన్లో పరిధిలో 500 మంది పైగా పోలీస్ సిబ్బంది, కేంద్ర సాయుద బలగాలు పాల్గొన్నారు అని తెలిపారు. ఈ నాకబందిని అంతర్ జిల్లా చెక్ పోస్ట్, అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ల నందు భారీ స్థాయి సిబ్బందితో చేయడం జరిగింది.
దీనిలో భాగంగా ఎస్పీ గురజాల సబ్ డివిజన్ లోని దాచేపల్లి మండలంలో గల పొందుగల అంత రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీని పర్యవేక్షించినారు.
ఈ వాహన తనిఖీల సమయంలో సామాన్య ప్రజలు, మహిళలకు, సీనియర్ సిటిజన్స్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి వాహనాన్ని తరువుగా చెక్ చేస్తూ పంపాలని, ఏదైనా అనుమానంగా అనిపిస్తే పై అధికారులకు తెలియజేయాలని చెక్ పోస్ట్ నందు గల సిబ్బందికి సూచించారు.
ఈ నాకాబంది లో మొత్తం జిల్లాలో 465 బైకులు,6ఆటోలు,3కార్లు
సరియైన రికార్డులు చూపించనందున సీజ్ చేయడమైనదని ఎస్పీ తెలిపారు.
అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయుటకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో లాడ్జిలు, కళ్యాణ మండపాలు, హాస్టల్స్ ని నిన్న రాత్రి తనిఖీలు చేయడం జరిగినది మరియు కొత్త వ్యక్తులకు లాడ్జిల్లో హోటల్స్ లో రూములు ఇచ్చి ఆశ్రయము కల్పించరాదని నోటీసులు ఇవ్వడం జరిగినది.
అదేవిధంగా జిల్లాలోని అన్ని బాణాసంచా గూడములకు కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి బాణాసంచాలు, మందుగుండు సామాగ్రి అమ్మ రాదని 6వ తేదీ వరకు బాణాసంచా గోడాములు/షాపులు మూసివేయాలని నోటీసులు ఇస్తూ, ఎవరైనా పోలీసు వారి సూచనలు పాటించకుండా బాణాసంచాలు అమ్మినట్లు తెలిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ రోజున కౌంటింగ్ సెంటర్ అయిన నరసరావుపేట రూరల్ మండలం కాకాని గ్రామం వద్ద గల జె ఎన్ టి యు కాలేజీ వద్ద కౌంటింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన బందోబస్తులోని పోలీసు అధికారులకు సిబ్బందికి ఎస్పీ బ్రీఫింగ్ ఇచ్చినారు.
కౌంటింగ్ సెంటర్ లోపల బయట అణువణువు సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నదని పాయింట్ పాయింట్ కి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగినదనీ ఎప్పటికప్పుడు డ్రోన్ల సహాయంతో కూడా కౌంటింగ్ సెంటర్ వద్ద పరిస్థితిని, ట్రాఫిక్ ని సమస్యాత్మక ప్రదేశాల్లో ప్రజల నడవడికలను చెక్ చేస్తున్నామని తెలియజేశారు.
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడడమే పోలీసు వారి ముఖ్య ఉద్దేశమని దీనికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా సోదరులు తమ వంతు సహకారం అందించాలని కోరారు.
జిల్లా పోలీసు కార్యాలయం,
పల్నాడు జిల్లా.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.