నారద వర్తమాన సమాచారం
జూన్ :04
వైసీపీ ఓటమికి కారణాలివే..!
గత ఎన్నికల్లో 151 సీట్లతో గెలిచిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓటమికి ‘పనిచేసే కార్యకర్తలు, నేతలను’ దూరం పెట్టడమే కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
2019కి ముందు తర్వాత వైసీపీలో విజయసాయిరెడ్డి లాంటి బలమైన వైసీపీ వాదులను నమ్మి ముందుకెళ్లిన జగన్ విజయం సాధించారు.
కానీ 2019 తర్వాత వారిని దూరం పెట్టి చెవిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారిని నమ్మి ముందుకెళ్లారు.
బలంగా పనిచేసే వైసీపీ కార్యకర్తలను దూరం పెట్టారు. వైసీపీ సోషల్ మీడియా ఉద్యమకారులను అస్సలు పట్టించుకున్న పాపాన పోలేదు.
వైసీపీ ఓటమికి లిక్కర్ పాలసీ కొంపముంచింది.. నాసిరకం మద్యంపై ఎంతో వ్యతిరేకత ఓట్ల రూపంలో వైసీపీ ఓటమికి దారితీసింది ..
2019కి ముందు ప్రాణం పెట్టి పనిచేసిన వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా కారులను పట్టించుకోకపోవడంతో వారు పనిచేయలేదు. అదే ఓటమికి దారితీసింది.
విజయసాయిరెడ్డిలాంటి పనిచేసేవాళ్లను దూరం పెట్టి.. పైరవీ కారులైన చెవిరెడ్డి, సజ్జలను ఎంకరేజ్ చేసి పార్టీని కార్యకర్తలకు, ప్రజలకు దూరం చేశారని కార్యకర్తలు విమర్శిస్తున్నారు.
ఇదే వైసీపీ ఓటమికి కారణంగా చెప్పొచ్చు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.