నారద వర్తమాన సమాచారం
జూన్ :07
పల్నాడు జిల్లా సత్తెనపల్లి
శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా సత్తెనపల్లి గడ్డపై అడుగుపెట్టిన కన్నా
అడుగడుగునా హారతులతో గజమాలలతో స్వాగతం పలికారు
సత్తెనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి వేలాదిగా తరలివచ్చి ఘన స్వాగతం పలికిన సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజానీకం
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ..
ఈ విజయం సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు అంకితం
మేం పాలకులం కాదు.. సేవకులం అని నిరూపిస్తాం
ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి నినాదంతోనే పనిచేశాం. ఎన్ని త్యాగాలు చేసైనా భావితరాల భవిష్యత్తు కోసం ముందుకెళ్లాం. కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయి. 45.60 శాతం తెదేపాకు, 39.37 శాతం వైకాపాకు వచ్చాయి.
అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం, ఏది పడితే అది చేస్తాం అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు.అవినీతి, అరాచకాలతో పనిచేస్తే ఇలాంటి గతే పడుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో చారిత్రాత్మక ఎన్నికలు జరిగాయి. 95% సీట్లు ఎన్డీయే సాధించింది. పవన్ కళ్యాణ్ గారు, బీజేపీతో కలిసి, అందరం కష్టపడి ప్రజల ఆదరాభిమానాలు పొందాం.
చంద్రబాబుతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో చరిత్రాత్మక విజయం సాధించాం. పవన్ కల్యాణ్ వ్యక్తి కాదు, తుఫాన్. ఏపీ విజయం సామాన్యుడి ఆకాంక్షలకు ప్రతిరూపం : ప్రధాని మోదీ
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు మహిళలు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.