నారద వర్తమాన సమాచారం
జూన్ :10
అగ్నిబాణ్: 3డీ ప్రింటర్‌తో తయారు చేసిన ప్రపంచంలోనే తొలి That’s ప్రత్యేకత ఏంటి?
3డీ ప్రింటర్‌తో తయారు చేసిన రాకెట్‌ను తమిళనాడులోని ఒక ప్రైవేట్ సంస్థ ఆవిష్కరించింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాయంతో ఐఐటీ మద్రాసులో 2018లో ఏర్పాటైన అగ్నికుల్ కాస్మోస్ అనే స్మార్టప్ కంపెనీ ఈ విజయాన్ని సాధించింది.
‘అగ్నిబాణ్’ అని పేరు పెట్టిన ఈ రాకెట్‌ను శ్రీహరికోటలో ఉన్న ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించింది.
ఈ లాంచ్ ప్యాడ్ అగ్నిబాణ్ రాకెట్‌ను రూపొందించిన అగ్నికుల్ కాస్మోస్‌కు చెందినదే.
ఈ సింగిల్ స్టేజ్ రాకెట్ ‘అగ్నికుల్ అగ్ని లైట్’ ఇంజిన్‌తో రూపొందింది.
పూర్తిగా 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో రూపొందిన ప్రపంచంలోనే తొలి రాకెట్ ఇదేనని కంపెనీ చెబుతోంది.
ఈ రాకెట్‌ను కంప్యూటర్‌పై డిజైన్ చేసి, 3డీ స్కానర్ వాడుతూ తయారు చేశారు.
ఇంజిన్‌లోని భాగాలను బిగించేందుకు వెల్డింగ్ అవసరం పడలేదు. ఎందుకంటే, 3డీ మోడల్ ద్వారా దీన్ని రూపొందించారు. అందుకే దీన్ని సింగిల్ కాంపోనెంట్ 3డీ ఇంజిన్‌గా పిలుస్తున్నారు.
అంతరిక్ష పరిశ్రమలో 3డీ సాంకేతికత అంతరిక్ష పరిశ్రమలో 3డీ సాంకేతికత వాడకం పెరుగుతోంది. అమెరికా, రష్యా, యూరప్, చైనాల్లోని అంతరిక్ష పరిశోధనా సంస్థలు 3డీ సాంకేతికతను వాడేందుకు ప్రయత్నిస్తున్నాయి.
‘‘3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా రాకెట్ ఇంజిన్‌లోని వివిధ భాగాలను లేదా కాంపోనెంట్లను విడివిడిగా వివిధ దేశాలు తయారు చేశాయి. ఈ విడిభాగాలను ఒకదానితో ఒకటి కలిపేందుకు, వాటిని వెల్డింగ్ చేయాల్సి ఉంటుంది. జాయింట్స్ కూడా దృఢంగా ఉండటం ముఖ్యం’’ అని ఐఐటీ మద్రాసులోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా, అగ్నికుల్ కాస్మోస్ అడ్వయిజర్‌గా ఉన్న సత్యనారాయణ ఆర్ చక్రవర్తి చెప్పారు.
‘‘వెల్డింగ్ వల్ల ఇంజిన్ ఎత్తు పెరుగుతుంది. మేం తయారు చేసిన సింగిల్ కాంపోనెంట్ ఇంజిన్‌కు వెల్డింగ్ అవసరం పడలేదు. దీంతో, ఇంజిన్ ఎత్తు పెరగలేదు’’ అని చెప్పారు.
ఈ రాకెట్ 30 నుంచి 300 కిలోల బరువైన ఉపగ్రహాలను మోసుకెళ్లగలదని ఈ రాకెట్ ఇంజిన్ తయారీదారులు తెలిపారు.
మే 30న ఈ రాకెట్ లాంచ్ చేసినప్పుడు, దానిలో ఎలాంటి ఉపగ్రహం లేదని ప్రొఫెసర్ సత్యనారాయణ చక్రవర్తి తెలిపారు.
‘‘సబ్-ఎర్త్ ఆర్బిట్‌లోనే దీన్ని పరీక్షించాం. 300 కిలోల ప్లేలోడ్‌ను తీసుకెళ్లే సామర్థ్యమున్న ఈ రాకెట్, 700 కి.మీల ఎత్తు వరకు ఎగరగలదు. వచ్చే కొన్ని నెలల్లో దీని సామర్థ్యాన్ని పరీక్షించనున్నాం’’ అని తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.