
నారద వర్తమాన సమాచారం
జూన్ :12
స్కూల్ పిల్లలకిచ్చే చిక్కీల కవర్లు మారాయి!
స్కూల్ పిల్లలకు ఇచ్చే చిక్కీల కవర్ల రంగు మారింది. ఇప్పటి వరకు వైసీపీ రంగులతో పాటు జగన్ బొమ్మను ముద్రించగా ప్రస్తుతం ప్రభుత్వ రాజముద్రతో చిక్కీల కవర్లను రూపొందించారు.
అలాగే వాటిపై ‘జగనన్న గోరుముద్ద’ అని ఉండగా దాన్ని తొలగించారు. రేపటి నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కావాల్సి ఉండటంతో విద్యార్థులకు చిక్కీలతో పాటు కోడిగుడ్లు, రాగిపిండి సరఫరా చేయనున్నారు.