నారద వర్తమాన సమాచారం:
భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
పురపాలక కేంద్రంలోని అర్బన్ బ్యాంక్ ఎన్నికల నేపథ్యంలో శనివారం నిర్వహించిన నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. కాగా ఎన్నికలలో 27 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి జి శ్రీనివాస్ మాట్లాడుతూ జనరల్ స్థానాలలో 11 మంది అభ్యర్థులు, మహిళ కేటగిరిలో ముగ్గురు, ఎస్సీ కేటగిరీలో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారని ఆయన తెలిపారు. ఎస్సీ ఒకస్థానం కోసం ఇద్దరు పోటీలో ఉండగా, ఇద్దరు మహిళ డైరెక్టర్ల కోసం ముగ్గురు పోటీలో ఉన్నారు. ఆరు జనరల్ స్థానాల కోసం 22 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థులందరికీ గుర్తులు కేటాయించి జాబితా విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ