నారద వర్తమాన సమాచారం
విద్యార్థులకు ‘స్టూడెంట్స్ కిట్స్’ పంపిణీ చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు.
ఇబ్రహీంపట్నం ప్రతినిధి..
ఎన్టీఆర్ జిల్లా. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలోని హైస్కూలు విద్యార్థులకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు స్టూడెంట్ కిట్స్ ను మంగళవారం అందజేశారు.
విద్యాశాఖ అందజేస్తున్న కిట్లలో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలతోపాటు, టోఫెల్ వర్క్బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకంతో పాటు 3 జతల యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ నిఘంటువు ఉంటుంది. 6 నుంచి 10 తరగతులకు నోట్బుక్స్ అందజేశారు.
పదోతరగతి సోషల్ స్టడీస్ పుస్తకాలను సి.బి.ఎస్.ఈ బోధనా విధానంలో.. జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్ పాలిటిక్స్ సబ్జెక్టులుగా ఎన్. సి.ఈ.ఆర్.టి సిలబస్ను ముద్రించి అందజేశారు. ఫిజికల్ సైన్స్ పుస్తకాలను ఆర్ట్ పేపర్పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వం ‘ఫ్యూచర్ స్కిల్స్’ కోర్సును అందుబాటులోకి తెచ్చిందని విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకుని అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ఆకాంక్షించారు. హైస్కూలు ఉపాధ్యాయులు, స్థానిక టీడీపీ నాయకులు, ఎన్డీఏ మహాకూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.