![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/06/img-20240619-wa16127106706171192781741-768x1024.jpg?resize=696%2C928&ssl=1)
నారద వర్తమాన సమాచారం
జూన్ :19 : నరసరావుపేట
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామ/ వార్డు మహిళా పోలీసులకు వారి యొక్క విధుల గురించి దిశా నిర్దేశం చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ మల్లీక గార్గ్ ఐ పిఎస్
- శాంతిభద్రతలు స్థాపనలో సచివాలయ మహిళా పోలీసులు భాగస్వాములు కావాలి.
- ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలకు మరింత చేరువ కావాలి. సైబర్ నేరాలు, లోన్ యాప్ లపై అవగాహన చేయాలి.
- రౌడీషీటర్ లపై అవగాహన కలిగి ఉండి నిరంతర ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
- అక్రమ మద్యం, అక్రమ ఇసుక, గంజాయి మొదలైన నిషేధిత పదార్థాల అక్రమ రవాణా, నిల్వలుపై దృష్టి సారించాలని సూచించారు.
- గ్రామ/వార్డు సచివాలయాల పోలీసులు సహకారంతో మహిళలపై జరుగుతున్న నేరాల అరికట్టడంపై దృష్టి పెట్టి, వాటిని అరికట్టాలనీ, తెలిపారు.
- సైబర్ నేరాలు, ముఖ్యంగా లోన్ యాప్ ల మోసాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, పోక్సో నేరాలపై విస్తృతంగా అవగాహన కలిగించాలని ప్రత్యేకంగా ఆదేశించినారు.
- గ్రామాలలో క్రొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు అయితే ఎస్ హెచ్ ఓ కి తెలియపరచాలి.
- గ్రామాలలోసి సి కెమెరాలు ఎర్పాటుచేసేవిధంగా గ్రామస్థులతో మాట్లాడి ఏర్పాటు చేయించాలి.
- ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా పరిధి లోని సచివాలయ మహిళా పోలీసులతో పాటు స్టేషన్ లోని యస్.ఐ / సీఐ లు మరియు డి.యస్.పి.లు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం, పల్నాడు జిల్లా.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.