నారద వర్తమాన సమాచారం
రాగి పాత్ర లోని నీరు త్రాగితే ఆరోగ్యానికి చాలా మంచిది
సహజంగా అందరికీ స్టీల్ లేదా ప్లాసిటిక్ బాటిల్స్ లో నీళ్లు తాగడం అలవాటు. కాపర్ (రాగి) పాత్రల్లో నీళ్లు లేదా ఆహరం తీసుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే రాగి పాత్రల్లో నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ పాత్ర లోని పోషక గుణాలు ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహా యపడతాయి. రాగి పాత్రల్లో ఆహరం, నీళ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పాత్రల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఒత్తిడి నుంచి పోరాడతాయి. వీటిలోని నీళ్లు తాగడం ద్వారా రక్తపోటు. థైరాయిడ్, రక్తహీనత సమస్యలను తగ్గిస్తుంది. రాగి పాత్రలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పాత్రల్లోని గుణాలు నీటిలోని హా నికరమైన క్రిములను తొలగించి మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతే కాదు పొట్టలో పుండ్లు, అజీర్ణం కడుపు ఇన్ఫెక్షన్లకు రాగి అద్భుతమైన ఔషధం. అధిక బరువుతో బాధపడుతున్న వారు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లు తాగడం వల్ల కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయ పడుతుంది. అంతే కాదు రాగిలోని యాంటీ ఆక్షిడెంట్ లక్షణాలు క్యాన్సర్ వ్యాధి నుంచి కాపాడతాయి. ప్రతీ రోజూ రాగి పాత్రలో నీటిని తాగడం ద్వారా శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఒత్తిడి నుంచి పోరాడి.. చర్మం పై ముడతలను తొలగించి వయసు కనిపించ నివ్వకుండా చేస్తుంది. కాపర్ థైరాయిడ్ గ్లాండ్ అసమానతలను బ్యా లెన్స్ చేసి థైరాయిడ్ గ్రంధి మెరుగ్గా పనిచే యడానికి ఉపయోగపడుతుంది. రాగి నీటిని తాగడం ఎముకలను దృఢంగా ఉంచుతుంది. రక్త హీనతతో బాధపడుతున్న వారు రాగి పాత్రలో నీళ్లు తాగితే చాలా మంచిది. రాగి హీమోగ్లోబిన్ తయారీకి కావాల్సిన ఇనుము శోషణకు సహాయపడుతుంది. సర్వేజనా సుఖినోభవంతు స్వస్తి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.