నారద వర్తమాన సమాచారం
కుళ్ళిన కోడి గుడ్లనువినియోగదారుల అంట కట్టిన స్మార్ట్ పాయింట్ నిర్వాహకులు
కుళ్లిపోయిన కోడిగుడ్లను చూపిస్తున్న వినియోగదారుడు కీర్తి సంజీవ్ :
భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
మంగళవారం పురపాలక కేంద్రానికి చెందిన కీర్తి సంజీవ పురపాలక కేంద్రంలోని స్మార్ట్ పాయింట్ లో ఆదివారం ఇంటి అవసరాల కోసం కోడిగుడ్ల ట్రై ను కొనుగోలు చేయగా ఈరోజు ఉదయం ఇంట్లో వాళ్ళు కోడిగుడ్లు ఉడకబెట్టి పొట్టు వలుస్తుండగా పూర్తిగా దుర్వాసనతో కూడి ఎరుపు రంగులో మారాయి. ఇదేమని ఒక పచ్చి గుడ్డుని పలగొట్టి చూడడంతో అందులో ఎర్ర మిశ్రమం తప్ప సోనా అనేదే లేదు. దీంతో కలత చెందిన సంజీవ ఇవి కోడిగుడ్ల నకిలీగుడ్ల అని కోడుగుడ్డు ట్రైను ఉడకపెట్టిన గుడ్లను తీసుకొచ్చి స్మార్ట్ పాయింట్ నిర్వాహకులను అడిగి చూడగా ఎలాంటి స్పందన లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తినే ఆహార పదార్థాలపై నాణ్యత చూపకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ కనీసం దానికి స్పందించకుండా నిర్వాహకులు చేస్తున్న నిర్లక్ష్యం పై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.