నారద వర్తమాన సమాచారం
జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి..
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత…
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
బాపట్ల…
జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో శనివారం నాడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. లోక్ అదాలత్ లో రాజీ చేయదగిన క్రిమినల్, సివిల్ వివాదాలు, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులలో కోర్టు వారు ఇచ్చిన నివేదిక, జిల్లా పరిధిలోని పోలీసు స్టేషన్ లలో నమోదైన కేసులు రాజీ పడటానికి అవకాశం ఉన్న కేసులలో కక్షిదారులకు నోటీసులు జారీ చేయాలన్నారు. ఇరు పక్షాల వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, జాతీయ లోక్ అదాలత్ గురించి అవగాహన కల్పించి వారి సమ్మతితో కేసులు పరిష్కరించాలని తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.