నారద వర్తమాన సమాచారం
కేటీఆర్‌ను కలిసి వారి బాధలు చెప్పుకున్న నిరుద్యోగ అభ్యర్థులు
నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చి ఇప్పుడు వాటిని పట్టించుకోవటం లేదు.. ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ పేరుతో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్ మెంట్లు అన్ని పత్రికల్లో ఇచ్చారు.
దాదాపు 10 పరీక్షలకు సంబంధించి డేట్లతో సహా నోటిఫికేషన్లు అంటూ తేదీలు ప్రకటించారు.. వాటికి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ ను విడుదల చేయలేదు. వెంటనే ఆ నోటిఫికేషన్లను విడుదల చేయాలి.
సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో గ్రూప్-2 లో 2 వేల ఉద్యోగాలు పెంచుతామని, గ్రూప్-3 లో వేలాదిగా ఉద్యోగాలు పెంచుతామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు.
మొదటి కేబినెట్ భేటీలోనే మెగా డీఎస్సీ అని చెప్పి నిరుద్యోగులను దగా చేశారు.. గ్రూప్-1 కు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన దానికి కేవలం 60 ఉద్యోగాలు యాడ్ చేశారు.
ఉద్యోగాలు పెంచమని అడిగితే సాంకేతిక కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటూ వారికోసం పోరాడుతుంది – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Discover more from
Subscribe to get the latest posts sent to your email.