గ్రామాల అభివృద్ధి కోసం నా వంతుగా కృషి చేశా: జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి
దంతూరులోని గౌడ సంఘం కాంపౌండ్ వాల్ పనులకు శంకుస్థాపన చేస్తున్న జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
గ్రామాల అభివృద్ధిలో నా వంతుగా కృషి చేశానని భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని జిల్లా పరిషత్ స్పెషల్ ఫండ్ 35 లక్షల నిధులతో దేశ్ముఖి గ్రామంలో పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కోసం ఐదు లక్షలు, యువజన సంఘ భవనం కోసం ఐదు లక్షలు, కనుముకులలో యువజన భవన పహారీ గోడ నిర్మాణానికి ఐదు లక్షలు, స్మశాన వాటిక నిర్మాణానికి ఐదు లక్షలు, దోతి గూడం లో బిసి కమ్యూనిటీ పది లక్షలు, దంతురులో గౌడ సంఘ భవనానికి పహారి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, జడ్పిటిసి కోట పుష్పలత మల్లారెడ్డితో కలిసి శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల పరిపాలనలో గ్రామాలలోని మౌలిక వస్తుల కల్పన కోసం అత్యధిక నిధులు కేటాయించామని ఆయన తెలిపారు. అభివృద్ధి సంక్షేమం కోసం గత ఐదేళ్లు ప్రజాల కోసం పాలన కొనసాగించి ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
ఎంపీడీవో భాస్కర్, పిఎసిఎస్ చైర్మన్ కందడి భూపాల్ రెడ్డి, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షురాలు బత్తుల మాధవి శ్రీశైలంగౌడ్, ఎంపీ ఓ మజీద్, స్పెషల్ ఆఫీసర్ స్వప్న, ఎంపీటీసీ చిల్లర జంగయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యాల మహిపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ దుర్గం స్వప్న నరేష్ యాదవ్, కోట అంజిరెడ్డి, పగిళ్ల స్వప్నరామిరెడ్డి, నాయకులు సిద్ధగోని లింగస్వామి, కనుమోని కుమార్, ముద్దం శ్రీశైలం, నోముల ఉపేందర్ రెడ్డి, వారాల రామచంద్రారెడ్డి, మేకల రామకృష్ణారెడ్డి, తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.