నారద వర్తమాన సమాచారం.
జి.కొండూరు మండలంలో 8771 మందికి రూ.5.79 కోట్లు.
పింఛన్లు పంపిణీ చేసిన మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు.
జి.కొండూరు, చెవుటూరు, వెంకటాపురం గ్రామాల్లో విస్తృత పర్యటన.
జి. కొండూరు ప్రతినిధి
ఎన్టీఆర్ జిల్లా. మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండల వ్యాప్తంగా 16 సచివాలయాల పరిధిలోని 8771 మంది లబ్ధిదారులకు రూ.5,97,77,500ల పింఛన్ సొమ్మును పంపిణీ చేస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. ఆయన సోమవారం జి.కొండూరు, చెవుటూరు, వెంకటాపురం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో పెంచిన పింఛన్ సొమ్ము రూ.7వేలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సంధర్భంగా సీఎం చంద్రబాబునాయుడు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. పలు చోట్ల కేకులను కట్ చేశారు. జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై వసంత అనే నినాదాలతో స్థానిక నాయకులు హోరెత్తించారు. జి.కొండూరు గ్రామంలో దివంగత నేత అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు కు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లు సొమ్మును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడో సంతకం పింఛన్ల పెంపుపై పెట్టి ఇప్పుడు అమలు చేసి చూపించారని పేర్కొన్నారు. ఆడిన మాట తప్పకుండా తెలుగుదేశం మహాకూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి పేదల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు గాంధీ. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ నూతులపాటి బాల కోటేశ్వరరావు (బాల), ఎన్డీఏ మహాకూటమి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.