నారద వర్తమాన సమాచారం
అవినీతి సామ్రాట్ బిరుదును సార్థకం చేసుకున్న జగన్, వైకాపా: ప్రత్తిపాటి
రాష్ట్రం రాజకీయాల్లోనే అవినీతి సామ్రాట్ అన్న బిరుదును మాజీ ముఖ్యమంత్రి, అతడి పార్టీ వైకాపా సార్థకం చేసుకున్నారని ఎద్దేవా చేశారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. తండ్రిచాటు బిడ్డగానే లక్ష కోట్లు కొట్టేసిన ఆ ఘనుడు గడిచిన అయిదేళ్లు గా దోపిడీలో విశ్వరూపమే చూపించారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం పోయి ప్రజా ప్రభు త్వం వచ్చిన దగ్గర్నుంచి తవ్వుతున్నకొద్ది వెలుగుచూస్తున్న జగన్, వైకాపా నేతల అవినీతి, అక్రమాలు అందుకు నిదర్శనమన్నారాయన. అడ్డుఅదుపులేని అవినీతికారణంగానే ఇప్పుడు ఆధారాల ధ్వంసానికి తెగపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రత్తిపాటి. ఈ మేరకు శుక్రవా రం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వైకాపా తీరుపై నిప్పులు చెరిగారు మాజీమంత్రి. జగన్ సర్కారులో జరిగిన అవినీతి వరస పేపర్ల దహనం ఘటనలే సాక్ష్యమన్న ప్రత్తిపాటి, వాళ్లు ఏ తప్పు చేయకుంటే ఇంతగా ఎందుకు బరితెగించి ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించారు. మరీ ముఖ్యంగా మాజీమంత్రి పెద్దిరెడ్డి అరాచకాలకు ఇక కాలం చెల్లిందని, రేపోమాపో అతడి పాపం పండి జైలుకు పోవడం ఖాయమన్నారు ప్రత్తిపాటి. అయిదేళ్లు పెద్దిరెడ్డి కనుసన్నల్లో జరిగిన రూ. వేల కోట్ల ఇసుక దోపిడీ, పర్యావరణం విధ్వంసంపై నిజాలు సమాధి చేయాలనే పీసీబీ ఆఫీసు దస్త్రాలు, హార్డ్‌డిస్క్‌లు నాశ నం చేయాలని చూశారన్నారు. ప్రస్తుతం జాతీయ హరిత ట్రైబ్యునల్, సుప్రీం కోర్టులో నడుస్తున్న కేసుల్లో కీలకమైన ఆధారాలు లభిస్తే పీకల్లోతు ఇరుక్కుపోతామనే భయంతోనే ఇంత దురాగతానికి ఒడిగట్టారన్నారు ప్రత్తిపాటి. కానీ ఎన్ని కుయుక్తులు పన్నినా గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి నా ఏ ఒక్కరూ తప్పించుకునే పోయే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణ, ఎర్రచందనం, టీడీఆర్ బాండ్లు, జగనన్న కాలనీల పేరిట చేసిన అక్రమాలే బయట పడ్డాయని… నిజానికి ఆ జాబితాలో ఇంకా చాలా పెద్దదే ఉందన్నారు ప్రత్తిపాటి. ప్రజలు అధికారం ఇచ్చింది వారికి సేవ చేయడానికనే విషయం మరిచిపోయి, కొందరు కీలుబొమ్మల్లాంటి అధికారులను అడ్డం పెట్టుకుని ఖజానాతో పాటు ప్రకృతి వనరుల్ని ఇష్టానుసారం కొల్లగొట్టి ప్రతిఒక్క వైకాపా నేత చట్టం ముందు నిలబడే రోజులు త్వరలోనే రానున్నాయని స్పష్టం చేశారు. వాళ్లలో ఏ ఒక్కర్ని వదిలిపెట్టినా రాష్ట్ర భవిష్యత్‌కు, ప్రజలకు ద్రోహం చేసినట్లే అవుతుంద ని ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్తిపాటి పుల్లారావు. ఇక నుంచి నాడు అడ్డదార్లు తొక్కిన వాళ్లందరికీ కౌంట్‌డౌన్ మొదలైనట్లే అని గుర్తు పెట్టుకోవాలన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.