నారద వర్తమాన సమాచారం
దాచేపల్లి క్వారీ గుంతలో యువకుడి మృతి
తండ్రి మందలించాడని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దాచేపల్లిలో వెలుగుచూసింది. మాచవరం మండలం వేమవరానికి చెందిన తిరుపతయ్య (20) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తండ్రి మందలించడంతో తిరుపతయ్య మనస్తాపానికి గురయ్యాడు. దాచేపల్లి మండలం నడికుడి క్వారీ గుంతలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో నెల్లూరు సమీపంలో ఆత్మహత్య కు ప్రయత్నం చేసినట్లు స్థానికులు చెప్పారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.