పుస్తక పఠనంతో మంచి నడవడిక అలవడుతుంది
పుస్తకావిష్కరణ చేస్తున్న డాక్టర్ నలవోలు నరసింహారెడ్డి
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
పుస్తక పఠనంతో జ్ఞాపకశక్తితో పాటు మంచి నడవడిక అలవడుతుందని జాతీయ తెలుగు సాహితీ పీఠం అధ్యక్షుడు డాక్టర్ నలఓలు నరసింహారెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలో వడ్డేపల్లి రాజేశ్వర్ రచించిన కాలకంట శతాకావిష్కరణ కార్యక్రమం ఆ సంఘం హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. చేనేత కార్మికుడైన రాజేశ్వర్ కవిగా పద్యాలు రచించి పుస్తకంగా తీసుకురావడం ఎంతో ఆదర్శనీయమని కొనియాడారు. కార్యక్రమంలో దోర్నాల కృష్ణ, నరసింహ, శేషగిరి, తడక యాదగిరి, పాండాల రాజేశ్వర్, అరుణ స్వామి, దయానంద్, రామకృష్ణ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.