నారద వర్తమాన సమాచారం
వార్షిక తనిఖీల్లో భాగంగా భిక్నూర్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పి సింధు శర్మ ఐపిఎస్…
కామారెడ్డి జిల్లా
వార్షిక తనిఖీల్లో భాగంగా భిక్నూర్ సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పి సింధుశర్మ ఐపిఎస్ సందర్శించడం జరిగినది. సర్కిల్ పరిదిలోని కేసుల నమోదు మరియు పరిష్కారములు అడిగి తెలుసుకోవడం జరిగినది. కేసు ఫైల్స్ మరియు రికార్డులను పరిశీలించి సి ఐ మరియు సర్కిల్ ఎస్సై లకు సూచనలు చేసినారు. పోలీస్ స్టేషన్లలో పెట్రోల్ కార్ మరియు బ్లూ కోట్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని మరియు డయల్ 100 పిర్యాదులపై తక్షణమే స్పందించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని కావున ప్రమాదాలను నివారించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారి పై చర్యలు తీసుకోవాలని సూచించినారు. ప్రజలకు సైబర్ నేరాల పట్ల, సై బర్ నేరగాలు చూపే మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి చైతన్య పరచాలని ఎస్పి తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేశ్వరరావు, భిక్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్, భిక్నూర్ ఎస్సై సాయికుమార్, రాజంపేట ఎస్సై సంపత్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.