నారద వర్తమాన సమాచారం
6 నెలలు జైలు శిక్ష
రూ 10 లక్షలు నష్టపరిహారం
పిడుగురాళ్ల లో చల్లని చెక్కు కేసులో కోర్టు తీర్పు పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఫిర్యాదుదారుడు కాలంగి ఏడుకొండలు ఫిర్యాదుదారుడు దగ్గర పది లక్షల రూపాయలు అప్పు తీసుకున్న ముద్దాయి హుజూర్నగర్ పట్టణం నల్గొండ జిల్లాకు చెందిన గూగుల్ వెంకటేశ్వరరావు అప్పు తీర్చుట నిమిత్తం 10 లక్షల రూపాయలకు చెక్కు ఇవ్వటం జరిగినది. ఆ చెక్కును ఆంధ్రాబ్యాంక్ పిడుగురాళ్ల శాఖలో వేయగా చెక్కు బౌన్స్ అవటం వలన పిడుగురాళ్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు లో కేసు నమోదు చేయగా ఈరోజు మంగళవారం పిడుగురాళ్ల జూనియర్ సివిల్ న్యాయమూర్తి మురళీ గంగాధర్ రావు బుధవారం తీర్పు చెప్పారు. ముద్దాయికి ఆరు నెలలు జైలు శిక్ష మరియు 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు. ఈ కేసును ఫిర్యాదుదారుని తరపున అడ్వకేట్ ఉడత కోటేశ్వరరావు తమ వాదనలు వినిపించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.