నారద వర్తమాన సమాచారం
ఐక్య ఉద్యమాల ద్వారానే చేనేత పరిరక్షణ సాధ్యం
చేనేత పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న చేనేత కళాకారులు, నాయకులు
ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న చేనేత నాయకులు
భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
చేనేత పరిరక్షణ కోసం కళాకారులు, కార్మికులు ఐక్య ఉద్యమాలు చేయడం ద్వారానే సాధ్యమవుతుందని పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్య, చింతకింది మల్లేశం, అన్నారు. పురపాలక కేంద్రంలో గురువారం చేనేత పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో చేనేత పరిరక్షణ మహా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పోచంపల్లి మండల తోపాటు వివిధ జిల్లాల నుండి కార్మికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరయ్యారు. నేతన్న విగ్రహం నుండి ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజి విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతన్న విగ్రహంతో పాటు ఆచార్యకొండ లక్ష్మణ్ బాబుజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ చేనేత వస్త్రాలకు జిఐ గుర్తింపు లభించిన కూడా ప్రభుత్వం నుంచి అందిస్తున్న చర్యలు మాత్రం శూన్యమని వారు అన్నారు.
అంతంతమాత్రంగా ఉన్న చేనేత పై నేడు ప్రింటెడ్ చీరల బెడద తాటికి పూర్తిగా అతలాకుతులమై పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నేడు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రింటర్ చీరలను అరికట్టడంలో కేవలం అమ్మిన దుకాణదారులపై చర్యలు తప్ప తయారీదారుడుపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నామమాత్రపు దాడులు నిర్వహించడం పట్ల ప్రింటెడ్ చీరలు విపరీతంగా చేనేత వస్త్రాలకు గిరాకీ లేకుండా పోయిందని వారు వాపోయారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా చేనేత పరిశ్రమపై ఎంతోమంది కళాకారులు ఆధారపడి జీవిస్తున్న ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి సంక్షేమం అందించడం లేదని వారు అన్నారు. రైతు తర్వాత చేనేత అనే నిదానంతో చాటి చెప్పడం తప్ప ఆచరించడం ఏ మేరకు లేదని వారు అన్నారు. జియో టాక్ కలిగిన కార్మికులకు కేవలం కొంతమందికి నామమాత్ర రుణాలను అందించి కార్మికులకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పడం తప్ప ఎలాంటి చర్యలు లేవని వారు అన్నారు. కాగా జిఐ కలిగిన చేనేత కళాకారు రూపొందించిన వస్త్రాలను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాల్సిన అంశం ఉన్నా కూడా అది ఏ మేరకు కూడా ఆచరించడం లేదని వారు వాపోయారు. కాగా నేడు పరిశ్రమ పూర్తిగా కనుమరుగైపోయే స్థితిలో ఉందని వాటిని ప్రభుత్వం ఇకనైనా మేలుకొని తక్షణమే చర్యలు చేపట్టే విధంగా కృషి చేయాలని వారు అన్నారు. కల చేనేత కళాకారులు రూపొందించిన ప్రతి వస్త్రాన్ని ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి వారికి చేతినిండా పని కల్పించే విధంగా తోడ్పడాలని వారు కోరారు. కేంద్ర రాష్ట్ర ఎన్ఫోర్మెంట్స్ అధికారులతో జి ఐ పేటెంట్ ఉన్న వస్త్రాలను ప్రింటెడ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలను అమలు చేయాలని వారు అన్నారు. కాగా పరిశ్రమ మనుగడ కోసం కార్మికులంతా ఐక్యం ఉద్యమాలు చేయడం ద్వారానే సాధ్యమవుతుందని ఇకనైనా రాష్ట్రవ్యాప్తంగా కార్మికులంతా ఐక్యంగా ఉద్యమం చేసి మన సమస్యలను ప్రభుత్వానికి విన్నవించే వరకు కలిసి రావాలని వారు పిలుపునిచ్చారు. ప్రింటెడ్ వస్త్రాలపై చర్యలు తీసుకుంటున్నాం రాష్ట్ర ఎన్ఫోర్మెంట్స్ అధికారి వెంకటేశం
చేనేత ప్రింటెడ్ రూపొందించిన వస్త్రాల తయారీదారులు విక్రయదారులపై ఇప్పటికే పలు దాడులు నిర్వహించి వారిపై చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమం టై అండ్ డై అధ్యక్షుడు భారత లవ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఈ కార్యక్రమంలో, సిల్క్ మార్క్స్ చెన్నై ప్రతినిధి శ్రీనివాస్, చేనేత జోలి జిల్లా సహాయ సంచాలకులు విద్యాసాగర్, జాతీయ అవార్డు గ్రహీతలు జిల్లా వెంకటేష్, తడక రమేష్, దుద్యాల శంకర్, రాష్ట్ర చేనేత నాయకులు కూరపాటి రమేష్ , తడక వెంకటేష్ ఎర్ర మాధవ్ వెంకన్న, తడక యాదగిరి
చేనేత కార్మిక చీరలోత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు రాపోలు శ్రీనివాస్, మహాజన సంఘము ఉపాధ్యక్షులు అంకం మురళి, పద్మశాలి చేనేత కార్మిక సంఘం అధ్యక్షురాలు మెరుగు శశికళ, సిల్క్ మర్చంట్ అధ్యక్షుడు సూరపల్లి రవీందర్, ఆచార్య కుండా లక్ష్మణ్ బాబుజి మర్చంట్ యూనియన్ అధ్యక్షుడు గుండు శ్రీరాములు, చేనేత జన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు చింతకింది రమేష్, టై అండ్ డై గౌరవ అధ్యక్షులు కర్నాటి బాలరాజ్ ,ఉపాధ్యక్షులు ఈపూరి ముత్యాలు, కుడికాల రామనరసింహ, సహా కార్యదర్శి గంజి బాలరాజ్, దోర్నాల సత్యనారాయణ,
నాయకులు సూరపల్లి రమేష్ , అంకం పాండు, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.