నారద వర్తమాన సమాచారం
రైతులను మోసం చేసిన గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి. .
కామారెడ్డి జిల్లా లో ఉన్నటువంటి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యజమాన్యం రుణాల పేరిట రైతుల ప్రమేయం లేకుండా కోట్ల రూపాయలను రుణాలు తీసుకొని చెరుకు రైతులను మోసం చేసిందని సి పి ఐ ఎం ఎల్ మాస్ లైన్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీలో సభ్యత్వం ఉన్నటువంటి రైతుల వద్ద నుండి పాసుబుక్కులను ఫ్యాక్టరీ యొక్క యజమాన్యం తీసుకొని రైతుల పేరిట బ్యాంకులో రుణాలను తీసుకోవడం జరిగింది ఇందులో రైతు ప్రమేయం లేకుండానే రుణాలు ఇచ్చినటువంటి బ్యాంకు యజమాన్యం అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ యజమాన్యం ఇద్దరూ కుమ్మక్కై రైతులను మోసం చేశారని అన్నారు ఇందులో ప్రస్తుతం 2500 మంది రైతులు ఉండగా ఇందులో నుండి 400 మందికి మాత్రమే మెసేజ్ లు వచ్చాయని అన్నారు సుమారు 25 కోట్ల వరకు మధ్యవర్తుల ద్వారా రైతుల పేరిట గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యజమాన్యం రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోందన్నారు ప్రభుత్వ అధికారులు ఈ యొక్క కుంభకోణంపై సమగ్రమైనటువంటి విచారణ జరిపి బాధ్యులైనటువంటి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యజమాన్యం మరియు ఈ కుంభకోణానికి సహకరించిన బ్యాంకు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ రుణాలు ఏవైతే ఉన్నాయో రైతులకు అందించాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల రైతు సంఘాలను మరియు ప్రజా సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో
సి పి ఐ ఎమ్ ఎల్ జిల్లా నాయకులు ఏ ప్రకాష్, కిషోర్, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు జి సురేష్ యువజన సంఘం నాయకులు రాజు,కార్మిక సంఘం నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.