న
ారద వర్తమాన సమాచారం
స్వచ్ఛందంగా,సామాజిక బాధ్యతతో తగాదాల పరిష్కారానికి కృషి- హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ వెల్లడి…
కామారెడ్డి జిల్లా
స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో సంస్థల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ సూచించారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు 2023లో తీసుకొచ్చిన మీడియేషన్ యాక్ట్ ద్వారా సామాజిక స్పృహ సేవా భావం కలిగిన కొందరిని కమ్యూనిటీ మెడిటేషన్ వాలంటీర్లుగా ఎంపిక చేసామన్నారు. చిన్న చిన్న తగాదాలతో పోలీస్ స్టేషన్ లు,కోర్టుల వరకు వెళ్లి సమయం, ధనం వృధా చేసుకుంటున్నారని ఇరు వర్గాల సముదాయించి సమస్యను పరిష్కరిస్తే న్యాయంతో పాటు స్నేహపూర్వకంగా సమాజం నిర్మితమవుతుందని అన్నారు. కేరళ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఇలాంటి మీడియేషన్ సెంటర్ ల ద్వారా ఐదువేలకు పైగా కేసులు పరిష్కరించడం జరిగిందని అన్నారు.
హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ జె. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ తెలంగాణలో ఒక సామాజిక కార్యకర్తల మరియు పెద్దమనుషుల సమక్షంలో తగాదాలను పరిష్కరించడానికి కమ్యూనిటీ మెడియేషన్ వాలంటరీలు పని చేయాలన్నారు. చిన్న సమస్యల వల్ల ఏండ్ల తరబడి క్యూ పెంచుకుంటున్నారని కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు జీవితం కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని డబ్బులను వృధా చేసుకుంటున్నారని తెలిపారు. ఎలాంటి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేని కమ్యూనిటీ వాలంటీర్ల కు గొప్ప బాధ్యతను సక్రమంగా ఎలాంటి లాభేక్ష లేకుండా సామాజిక బాధ్యతతో కుటుంబ, వ్యక్తిగత, భూ వైవాహిక తగాదాలను పరిష్కరించాలని సూచించారు.తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో ఈ కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్ల నియామకం జరిగిందని వీరికి రెండు రోజులు శిక్షణ అనంతరం గ్రామాల్లో పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
గ్రామాలలో కొందరు ప్రజలు కోర్టు కేసుల వరకు వెళ్తున్నారు. పరిష్కరించుకునే సమస్యల సైతం పంతాలకు పోయి పోలీస్ కేసులు వరకు వెళ్తున్నారు. ఏళ్ల క్రితం గ్రామాల్లో పెద్ద మనుషులే ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించేవారు. ఇప్పటినుండి సమస్యలను పరిష్కరించి కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్ల రాష్ట్రంలో ఆదర్శవంతంగా పనిచేయాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ రాజీమార్గం ద్వారా సమస్యలను పరిష్కరించడం వల్ల సమాజంలో మంచి వాతావరణం ఏర్పడుతుందని ఇందుకోసం వాలంటరీల కృషి చేయాలని సూచించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో మంచి పేరు, రాజకీయ ప్రమేయం లేని, ఇలాంటి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేని వారిని గుర్తించి కమ్యూనిటీ వాలంటరీగా ఎంపిక చేశామని సామాజిక బాధ్యతతో చిన్నచిన్న తగాదాలను పరిష్కరించాలని, ఎలాంటి ప్రభావములకు గురి కావద్దని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐపీఎస్ సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబెర్ సెక్రటరీ పంచాక్షరీ, కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయ మూర్తి డాక్టర్ సి హెచ్.వి.ఆర్.ఆర్ వరప్రసాద్, అడిషనల్ జిల్లా న్యాయ మూర్తి లాల్సింల్ శ్రీనివాస్ నాయక్ , సీనియర్ సివిల్ జడ్జి మరియు సెక్రటరీ టి. నాగరాణి, జూనియర్ సివిల్ జడ్జి కే. సుధాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి దీక్ష, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సూపరింటెండెంట్ వి. చంద్రసేన్ రెడ్డి మరియు సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు .
Discover more from
Subscribe to get the latest posts sent to your email.