నారద వర్తమాన సమాచారం
అయోధ్య లో సరయూ నది ఘాట్ వద్ద ప్రమాదం.
గల్లంతైన తెలుగు అమ్మాయి.
జనగామ జిల్లా కేంద్రానికి చెందిన తాళ్ళపల్లి నాగరాజు కుటుంబ సభ్యులు, ఆయన సోదరుల కుటుంబసభ్యులు పదిహేను మంది వరకు రెండు రోజుల క్రితం అయోధ్య కు వెళ్లారు. రామ మందిరం సహా స్థానికంగా ఉండే ఆలయాలను సందర్శించి పుణ్య స్నానాల కోసం సోమవారం ఉదయం 8 గంటలకు సరయూ నది లక్ష్మణ్ ఘాట్ కు వెళ్లారు.. ఐతే భారీ వర్షాల నేపథ్యంలో పైన నుండి ఒక్కసారిగా వరద నీటిని వదలడంతో ఘాట్ పైకి వరద దూసుకు వచ్చింది. దీంతో వీరిలో ఐదుగురు నీటిలో పడిపోగా నలుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఒక బాలిక మాత్రంఉత్త ప్రదేశ్ అధికారులతో మాట్లడినప్పటికీ పెద్దగా ఫలితం లేకుండా పోయింది. బాలిక ఆచూకీ తెలియక కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు ఇప్పటికీ లక్ష్మణ్ ఘాట్ వద్దే ఉండిపోయారు..
బాలిక పేరు : తేజస్విని
జనగామ లోని abv కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.