Friday, November 22, 2024

హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని,హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపరాదని,ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని న్యాయవాది :దివ్వెల శ్రీనివాసరావు:

నారద వర్తమాన సమాచారం

సత్తెనపల్లి పట్టణం /రైల్వే స్టేషన్ లో ఆటో స్టాండ్ దగ్గర.

హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని,హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపరాదని,ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్

ధరించాలని ప్యానల్ న్యాయవాది దివ్వెల శ్రీనివాసరావు తెలిపారు.రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం యొక్క ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి ఆదేశానుసారం సత్తెనపల్లి మండల న్యాయసేవాధికార అధికార సంస్థ చైర్మన్ మరియు సీనియర్ సివిల్ జడ్జి వెంకట నాగ శ్రీనివాసరావు సూచనల మేరకు మోటారు వాహనాల చట్టం గురించి,సత్తెనపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ లో ఆటో స్టాండ్ వద్ద, న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్బంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్క మోటారు వాహన దారులు రోడ్డు ప్రమాదాలపై జాగ్రత్తలు పాటించాలని, ద్విచక్ర వాహన దారులు విధిగా హెల్మెట్ ధరించాలని,లేకపోతే ప్రమాదాల బారిన పడటమే కాక ఒక్కోసారి ప్రాణాలు కూడ పోతున్నాయని హెచ్చరించారు.యువత ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో తలకు ఎక్కువగా గాయం కావడం వల్ల చనిపోతున్నారని అందువల్ల ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం, కారులో ప్రయాణించేవారు సీటు బెల్టు ధరించకపోవడం అది చట్టపరంగా నేరం అని తెలియజేశారు.జులై 1 నుండి దేశంలో క్రొత్త చట్టాలు అమలులోకి వచ్చాయని, అంతేకాకుండామైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని,అలా ఇస్తే వాహన యజమానులకు, తలిదండ్రులు కూడా శిక్షలు పడే విధంగా నూతన చట్టాలు ఉన్నాయన్నారు.ప్రతి ఒక్క వాహన దారులు విధిగా వారి వాహనమునకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా పొందాలి.సకాలంలో వాహనానికి ఇన్స్యూరెన్స్ చెల్లించాలని ఇంకా పలు అంశాలపై అవగాహన కల్పించారు. పిడుగురాళ్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సి. హెచ్.రాంబాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా 25ఏళ్ల నుంచి 35 ఏళ్ళ లోపు యువత ఎక్కవ చనిపోవడం జరుగుతుందని,అతి వేగం అత్యంత ప్రమాద కరమని,మైనర్ లకు వాహనాలు ఇవ్వకూడదని,ప్రాణం ఎంతో విలువైనదని,హెల్మెట్ రక్షణ కవచం అని,రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం మూలంగా జరుగుతునాయని,నిదానమే ప్రదానమని,రోడ్డు భద్రత తీసుకోవాల్సిన జాగ్రత్తలు హెల్మెట్ వల్ల ఉపయోగం మండల న్యాయ సేవ సాధికార సంస్థ వల్ల ప్రజలు కలిగే ఉపయోగాలు గురించి వివరించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపరాదని,లైసెన్సు లేకుండా వాహనాలు నడుపరాదని, వాహనాలకు ఇన్స్యూరెన్సు అవసరమని, వాహనదారులు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు చదువుతో సంబంధం లేకుండా డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వటం జరుగుతుందని,ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో న్యాయవాది దివ్వెల శ్రీనివాసరావు, పిడుగురాళ్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సి.హెచ్.రాంబాబు , ప్యానల్ న్యాయవాది గంటా వెంకటశివ,పారా లీగల్ వాలంటీర్లు షేక్ సుభానిమరియు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మరియు పారా లీగల్ వాలంటీర్ జక్కుల లక్ష్మీనారాయణ,సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో కోర్టు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న షేక్ బాజీ మరియు ఆటో డ్రైవర్లు మరియు ప్రజలు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version