స్మశాన వాటిక పనులను త్వరగా తగ్గా పూర్తి చేయాలిమున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రాన్ని అందిస్తున్న కాటికాపర్ల సంఘం నాయకులునారద వర్తమాన సమాచారం, భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:పురపాలక కేంద్రంలో మంగళవారం శివపుత్ర కాటికాపర్ల సంఘం ఆధ్వర్యంలో హిందూ స్మశాన వాటిక పనులను త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ వీరారెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సంకు నరసింహ మాట్లాడుతూ స్మశాన వాటిక పనులు ఆగిపోవడం ద్వారా పట్టా భూముల్లో అంతక్రియలో నిర్వహిస్తున్న నేపథ్యంలో పట్టాదారులు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతున్నారని దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. వెంటనే స్మశాన వాటిక పనులను పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు సొల్లు లింగయ్య తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.