రెండో విడత రుణమాఫీ అయిన రైతులకు వెంటనే రుణాలు అందించాలి: కలెక్టర్ హనుమంతు కే జండగే
నారద వర్తమాన సమాచారం: భూధాన్ పోచంపల్లి, ప్రతినిధి:
జిబ్లాక్ పల్లి లో కెనరా బ్యాంక్ లో వివరాలు అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్ హనుమంతు కే జండగే
రెండో విడత రుణమాఫీ అయినా రైతులకు పంట పెట్టుబడికి తిరిగి రుణాలను వెంటనే అందించాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కె జండగే బ్యాంకర్లను సూచించారు.
మండలంలోని జిబ్లాక్ పల్లి లో బుధవారం కెనరా బ్యాంకు ని ఆయన సందర్శించిన సందర్భంగా బ్యాంకు మేనేజర్ తో రుణమాఫీ సంబంధించిన రైతు వివరాలను రుణమాఫీని ఏ విధంగా అమలు చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంకులో అకౌంట్ నంబర్ చేంజ్ ద్వారా రైతులకు రుణమాఫీ అందక ఎదుర్కొంటున్న ఇబ్బందుల తీరుని ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రుణమాఫీ సంబంధించిన రైతులకు అకౌంట్లో డబ్బులు అందే విధంగా అన్ని చర్యలు బ్యాంకర్లు తీసుకోవాలని ఆయన వారిని కోరారు. కాగా రుణమాఫీ విషయంలో రైతులుఎవరు ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకునే బాధ్యత బ్యాంకర్ల తీరని ఆయన అన్నారు. అనంతరం పురపాలక కేంద్రంలోని మార్కండేయ నగర్ లో అమ్మ ఆదర్శ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల తీరుపై కలెక్టర్ వీరారెడ్డిని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి అజాజ్ అలీ ఖాన్, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు శ్వేత, శిరీష ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.