పాఠశాల భద్రత కోసమే సీసీ కెమెరాలు..పెర్కిట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సీసీ కెమెరాలు అందజేసిన పూర్వ విద్యార్థులు…నారద వర్తమాన సమాచారం
ఆర్మూర్ :పాఠశాల భద్రత కోసమే సీసీ కెమెరాలను పూర్వ విద్యార్థులు నా సూచన మేరకే ఏర్పాటు చేయించారని ప్రభుత్వ ఉపాధ్యాయుడు పసుపుల రఘునాథ్, పూర్వ విద్యార్థి ఇట్టేడి మోహన్ రెడ్డి లు అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని
పెర్కిట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు మీడియం పాఠశాల ఆవరణలో శనివారం ఆ పాఠశాలలో 1998- 99 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు సీసీ కెమెరాలను పాఠశాల హెచ్ఎం ఎం.శ్రీనివాస్ కి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పాఠశాల పరిసరాల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఇటీవల పెర్కిట్ కోటార్ మూర్లోని జిఆర్ గార్డెన్ లో నిర్వహించుకున్న మా పదవ తరగతి మిత్రుల సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనంలో మేమందరం కలిసి పాఠశాలకు సీసీ కెమెరాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని అన్నారు. విద్యార్థులు భద్రంగా ఉంచుకోవాలని, మంచి ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలన్నారు. అనంతరం పాఠశాలకు సీసీ కెమెరాలు ఇచ్చిన పూర్వ విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఎం. శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, పూర్వ విద్యార్థులు పుచ్చుల సృజన్ , పెంట మహిపాల్ రెడ్డి, రాస భూమేశ్వర్ , జి. నాగరాజ్, సిహెచ్. ప్రకాష్, విద్యార్థులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.