నారద వర్తమాన సమాచారం
ఆడపిల్లకు 9 ఏళ్లకే పెళ్లి?: పార్లమెంటులో బిల్లు
ఇరాక్ :
ఏ దేశంలో నైనా అమ్మాయి పెళ్లి వయసు 18 ఏళ్లకు ఉంటుంది. ఇరాక్‌లోనూ ఇప్పటి వరకు అలాగే ఉంది. అయితే, తాజాగా అక్కడి ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అమ్మాయిల వివాహ వయ సును 9 ఏళ్లకు కుదించాలని అందులో ప్రతిపాదించడమే దీనికి కారణం. పర్సనల్ స్టేట్ లాను సవరించే ఉద్దేశంతో ఇరాక్ న్యాయ మంత్రిత్వ శాఖ ఈ బిల్లును ప్రవేశ పెట్టింది.
ఈ బిల్లు కానీపార్లమెంటులో ఆమోదం పొందితే బాల్య వివాహాలు ఇబ్బడి ముబ్బ డిగా పెరిగిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమ్మాయిలకు 9 ఏళ్లు, అబ్బాయిలకు 15 ఏళ్లు వస్తే వివాహాలకు సిద్ధమై పోతారు.
ఈ విషయంలో వారికి చట్టపరంగా ఎలాంటి అడ్డం కి ఉండదు. లింగ సమాన త్వంతోపాటు మహిళా హక్కుల విషయంలో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని ఈ బిల్లు నట్టేట్లో కలిపేస్తుందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు ఆందో ళన వ్యక్తం చేస్తుండగా.. అమ్మాయిలు చిన్నవయ సులోనే తప్పుదోవ పట్టకుం డా బిల్లు ఉపకరిస్తుందని కొంతమంది ఎంపీలు చెబుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.