నారద వర్తమాన సమాచారం
సీఎంపై ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్, దెబ్బకు గవర్నర్ కు బుల్లెట్ ఫ్రూఫ్ కారు
ముడా కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడంతో ఆ రాష్ట్ర గవర్నర్ లో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోందని కన్నడ మీడియా అంటోంది. ఈ నేపథ్యంలో బుల్లెట్ ప్రూఫ్ కారును కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఉపయోగిస్తున్నారు.
కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ మద్దతుదారులు, సిద్ధరామయ్య అభిమానులు ఆందోళనలు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కారును ఉపయోగిస్తున్నారు.
సీఎం సిద్దరామయ్యపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడంపై గవర్నర్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఇదే సందర్బంలో కర్ణాటక గవర్నర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బెంగళూరులోని రాజ్ భవన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గతంలో బుల్లెట్ ప్రూఫ్ కారు ఉన్నప్పటికీ వాటిని వినియోగించకుండా గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మామూలు కార్లలోనే తిరిగేవారు. అయితే ఇప్పుడు ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందుకే భద్రత కోసం కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ బుల్లెట్ ప్రూఫ్ కారును ఉపయోగిస్తున్నారు. కర్ణాటక గవర్నర్ తీరుపై కాంగ్రెస్ నాయకులు, మంత్రులు పలు ఆరోపణలు చేస్తున్నారు.
కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ బీజేపీ నాయకుల మాటలు విని సీఎం సిద్దరామయ్యపై విచారణకు ఆదేశించారని, ఆయన ఏకపక్షంగా వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. గవర్నర్ పదవిలో ఉంటూ కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం, సీఎం సిద్దరామయ్యపై విచారణకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆదేశించడం ఇప్పుడు వివాదానికి కారణం అయ్యింది. ఈ నేపథ్యంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ బుల్లెట్ ఫ్రూఫ్ కారు ఉపయోగిస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.